Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలురాజకీయ వార్తలు

రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపును ఎవరు ఆపలేరు … 80 కి పైగా సీట్లు ఖాయం సీఎల్పీ నేత భట్టి…

రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపును ఎవరు ఆపలేరు … 80 కి పైగా సీట్లు ఖాయం సీఎల్పీ నేత భట్టి
పీపుల్స్ మార్చ్ కు జననీరాజనంఊహించని స్పందన
ఇందిరమ్మ రాజ్యం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు
ఎక్కడకు వెళ్లిన అపూర్వ స్వాగతం పలుకుతున్నారు
ప్రజల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది
కాంగ్రెస్ ఓటు వేసి తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ ఋణం తీర్చుకుంటామని అంటున్నారు .
అనేక మంది మహిళలు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రాలేదని చెబుతున్నారు
కేసీఆర్ పాలనపై ప్రజల్లో విరక్తి ఉంది.
కాంగ్రెస్ లో అందరం కలిసి కట్టుగానే ముందుకు పోతాం
సీఎం విషయం అధిష్టానం నిర్ణయిస్తుంది

తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరు ఆపలేరని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విశ్వాసం వ్యక్తం చేశారు . స్పష్టమైన మెజార్టీతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అన్నారు సూర్యాపేట జిల్లాలోని నకిరేకల్ నియోజకవర్గం కేతేపల్లి మండలం కొప్పోల్లు గ్రామంలో పీపుల్స్ మార్చ్ యాత్ర చేస్తున్న భట్టిని ఖమ్మం నుంచి వెళ్లిన విలేకర్ల బృందం మర్యాద పూర్వకంగా కలిసింది .

100 రోజులుగా 1000 కి .మీ 30 కి పైగా నియోజవర్గాల మెయిలు రాయిని దాటిన భట్టి నాలుగురోజుల క్రితం వడదెబ్బతో అస్వస్థతకు గురైయ్యారు . వడదెబ్బ నుంచి కోలుకున్న తర్వాత తిరిగి యాత్ర కంటిన్యుచేస్తున్నారు . పలువురు కాంగ్రెస్ నేతలు వెంట రాగ ఆయన యాత్ర కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. సందర్భంగా విలేకర్లు ఆయన్ను పలకరించగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని దీన్ని ఏశక్తి అడ్డుకోలేదని ధీమా వ్యక్తం చేశారు . ఎన్ని సీట్లు వస్తాయని ప్రశ్నించగా 80 కి పైగానే వస్తాయని తాము భావిస్తున్నామని అయితే ఆఊపు వచ్చిన తర్వాత ఇంకా పెరిగినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదన్నారు . పార్టీలో ఐక్యత గురించి అడగ్గా అన్ని పార్టీలో అవి ఉంటాయని కాంగ్రెస్ లో అవి బయటకు కనిపిస్తాయని అన్నారు .అయినా పార్టీలో చిన్న చిన్న తేడాలు ఉన్నావాటిని పరిష్కరించుకుంటామని అన్నారు . ఎన్నికలు , అభ్యర్థులు అన్ని అధిష్టానం ఆలోచనలు చేస్తుందని దానికి పెద్ద ఇబ్బంది ఏమిలేదని లైట్ గా కొట్టి పారేశారు . సీఎం అభ్యర్థి విషయం అధిష్టానం నిర్ణయిస్తుందని అన్నారు.

భట్టి ఎన్ని యాత్రలు చేసిన పొర్లు దండాలు పెట్టిన కాంగ్రెస్ అధికారంలోకి రాదని బీఆర్ యస్ నాయకులు చేస్తున్న విమర్శలు గురించి ప్రస్తావించగా ,వారు విమర్శలు చేస్తున్నారంటేనే ప్రజల నుంచి యాత్రకు వస్తున్నా ఆదరణ వారిలో కంగారు పుట్టిస్తుందని అన్నారువారిలో భయం మొదలైందని అది ఇంకా పెరుగుతుంది తప్ప తరిగే ప్రశ్న లేదన్నారు .కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు వైఫల్యం చెందిదన్నారు . పైగా వాటిని బుల్డోజ్ చేసి కొత్త స్కిమ్ లు తెచ్చి మోసం చేయాలనీ చూస్తుందని కేసీఆర్ పాలనపై భట్టి ధ్వజమెత్తారు . ప్రజలు తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీని , మదిలో పెట్టుకున్నారని అందువల్ల ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన కాలనీలు , ఇళ్లస్థలాల గురించి గ్రామాల్లో చర్చ జరుగుతుందని అన్నారు . ఇందిరమ్మ రాజ్యం కావాలని కోరుకుంటున్నారని తెలిపారు .

పీపుల్స్ మార్చ్ పాదయాత్ర లో భాగంగా ఆయన నకిరేకల్ నియోజకవర్గంలోని కొప్పోల్లు గ్రామం నుంచి 101 రోజు తన పాదయాత్రను ప్రారంభించారు . గ్రామస్తులు పెద్ద ఎత్తున భట్టి పాదయాత్రకు స్వాగతం పలికారు . ఆయనపై పూలవర్షం కురిపించారు . మహిళా కోలాట బృందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రజలకు అభివాదం చేస్తూ ఆయన యాత్రలో పాల్గొన్నారు . వివిధ కూడళ్లలో ప్రజలను పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు . మహిళలతో ముచ్చటిస్తూ మీకు డబుల్ బెడ్ రూమ్ వచ్చిందా అని భట్టి అడిగి తెలుసుకున్నారు .రాలేదు నాయన అంటే మన ప్రభుత్వం వస్తుంది. ఇందిరమ్మ రాజ్యం వచ్చినంక తప్పకుండ ఇళ్ల స్థలం ఇచ్చాయి ఇల్లు కట్టించే కార్యక్రమం చేపడతామని ఆయన మహిళలకు హామీ ఇచ్చారు . భట్టి వెంట ఆయన సతీమణి మల్లు నందిని , ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి మహమ్మద్ జావేద్ సూర్యాపేట , నల్లగొండ , నకిరేకల్ నాయకులు ఉన్నారు .

జూలై 2 పీపుల్స్ మార్చ్ ఖమ్మం బహిరంగ సభతో ముగింపు …?

పీపుల్స్ మార్చ్ ముగింపు సందర్భంగా జూలై 2 తేదీన ఖమ్మం లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు భట్టి తెలిపారు . దానికి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చే అవకాశాలు ఉన్నాయని అయితే రెండు మూడు రోజుల్లో తేదీని కచ్చితంగా ప్రకటిస్తామని తెలిపారు .ఈసభలోనే ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి, మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు , కొత్తగూడం జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య , మాజీ ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు ,ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నారు … 

Who can stop the Congress from winning in the state … more than 80 seats are assured CLP leader Bhatti
Jananirajan to the People’s March …unexpected response
People want Indiramma’s kingdom
Wherever you go, Apurva welcomes you
There is a clear change in people
They say that they will pay off the debt of Soniamma which was given to Telangana by Congress vote.
Many women say that they cannot afford a double bedroom house
People are disgusted with KCR’s rule.
All of us in Congress will move forward together
The Chief will decide the matter of CM

CLP leader Bhatti Vikramarka has expressed confidence that no one can stop the victory of the Congress party in the assembly elections to be held in Telangana state. He said that the Congress will come to power with a clear majority. A group of journalists who had traveled from Khammam met Bhatti who was conducting a People’s March Yatra in Koppollu village of Nakirekal constituency in Ketepalli mandal of Suryapet district. Bhatti, who has crossed the milestone of 1000 km in 30 constituencies for 100 days, fell ill due to sunburn four days ago. After recovering from sunburn, they are continuing the trip. Many Congress leaders came along with his yatra and he got a good response from the people. When the reporters greeted him on this occasion, he said that it is certain that the Congress will come to power in Telangana and expressed confidence that no power could stop it. When asked how many seats will come, they said that they think that more than 80 will come, but after the momentum, there is no need to be surprised if it increases. When asked about the unity in the party, he said that they exist in all the parties and they will come out in the Congress. Elections and candidates have dismissed the idea that there is no big problem with it. He said that the Chief Minister will decide the matter of CM candidate.

Bhatti referred to the criticism of the BRS leaders that the Congress would not come to power because of the number of yatras they have done, but they are criticizing, but the people are coming to the yatra, but they are receiving support. It has failed. Moreover, Bhatti criticized the KCR regime for bulldozing them and bringing new schemes to cheat them. He said that people have kept in mind Sonia Gandhi who gave Telangana and therefore there will be a discussion in the villages about the colonies and houses given in Indiramma’s kingdom. He said that Indiramma wants to become a kingdom.

As part of the People’s March Padayatra, he started his 101-day padayatra from Koppollu village in Nakirekal constituency. The villagers welcomed the Bhatti Padayatra on a grand scale. Flowers were showered on him. Women’s Kolata teams were a special attraction. He participated in the yatra by saluting the people. Greeted people at various intersections and went ahead knowing their problems. While flirting with women, Bhatti asked if you got a double bedroom. He assured the women that they would give them land and build a house even after the arrival of Indiramma’s kingdom. Bhatti was accompanied by his wife Mallu Nandini, Khammam City Congress President Khammam Assembly Constituency Incharge Mohammed Javed Suryapet, Nalgonda and Nakirekal leaders.

People’s March ends with Khammam public meeting on July 2 …?

Bhatti said that a huge public meeting is being arranged in Khammam on July 2 on the occasion of the end of the People’s March. He said that there are chances of the party’s top leader Rahul Gandhi coming, but the exact date will be announced in two or three days. In this assembly, former Khammam MP Ponguleti, former minister Jupalli Krishna Rao, Kothagudam ZP chairman Koram Kanakaiah, former MLAs, MLCs and other public representatives are expected to join Congress in the presence of Rahul on a large scale…

Related posts

ఈటల అప్పుడలా …… ఇప్పుడిలా …….టీఆర్ఎస్ శ్రేణులు…….

Drukpadam

రాష్ట్రప‌తి ఎన్నిక‌పై బీజేపీకి దీదీ స్ట్రాంగ్ కౌంట‌ర్!

Drukpadam

వివేకా హత్య కేసులో తనను ఇరికించే ప్రయత్నం ;ఎంపీ అవినాష్ అనుమానం …

Drukpadam

Leave a Comment