Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మంగళూరు సమీపంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కారుకు ప్రమాదం

  • పైలట్ రోహిత్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు టైర్లు బ్లాస్ట్ అయిన వైనం
  • రోడ్డు పక్కనున్న కరెంట్ పోల్ ను ఢీకొన్న వాహనం
  • ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ రోహిత్

బీఆర్ఎస్ పార్టీ తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు కర్ణాటకలో రోడ్డు ప్రమాదానికి గురైంది. శృంగేరికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మంగళూరు సమీపంలో ముడూరు – నల్లూరు క్రాస్ వద్ద రోహిత్ రెడ్డి వాహనం వెళ్తుండగా టైర్ బ్లాస్ట్ అయింది. దీంతో అదుపుతప్పిన కారు రోడ్డు పక్కనున్న కరెంట్ స్తంభాన్ని ఢీకొంది. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో రోహిత్ రెడ్డి సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని మరో వాహనంలో రోహిత్ రెడ్డిని శృంగేరికి పంపించారు. రోహిత్ రెడ్డి కారుకు యాక్సిడెంట్ అయిందనే సమాచారంతో ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు ఆందోళనకు గురయ్యారు. అయితే ప్రమాదంలో ఆయనకు ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Related posts

అన్ని మతాల అమ్మాయిలకు ఒకే వివాహ వయస్సు వుండాలంటూ పిటిషన్… కేంద్రానికి సుప్రీం నోటీసులు

Drukpadam

సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్ ను విచారించే ధర్మాసనం ఖరారు

Ram Narayana

టీఆర్ యస్ ఉద్యమ పార్టీనా ….లేక కుటుంబ పార్టీనా ?

Drukpadam

Leave a Comment