- పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలు నమ్మవద్దన్న రాజగోపాల్ రెడ్డి
- ఈ విషయాన్ని మీడియా ఎక్కువ చేసి చూపిస్తోందని వ్యాఖ్య
- ప్రజల్లో ఉన్న అపోహలను పార్టీ తొలగించుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడి
తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. బీజేపీలోనే ఉన్నానని, ఊహాగానాలు నమ్మవద్దని కోరారు. తాను కాంగ్రెస్ లో చేరుతున్నట్టు మీడియా ఎక్కువ చేసి చూపిస్తోందని అన్నారు.
ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో హైకమాండ్‌తో జరిగే సమావేశంలో తన అభిప్రాయాన్ని వివరిస్తానని తెలిపారు. ప్రజల్లో ఉన్న అపోహలను పార్టీ తొలగించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందేనని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారని అన్నారు.
రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకారం అందిస్తుందని రాజగోపాల్ రెడ్డి అన్నారు. అందులో భాగంగానే కేటీఆర్ కు కేంద్ర మంత్రులు అపాయింట్‌మెంట్ ఇస్తున్నారని వివరించారు. ఈ విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా తలుచుకుంటే ఇప్పటికీ తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే అవకాశం ఉందన్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత ప్రజల ఆలోచనలో కొంచెం మార్పు వచ్చినట్టు కనబడుతోందని వివరించారు.
కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో మార్పు వచ్చింది: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- కవిత విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందేనన్న రాజగోపాల్ రెడ్డి
- హైకమాండ్ కు ఇదే విషయాన్ని వివరిస్తానని వెల్లడి
- తాను ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నానని వ్యాఖ్య
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారంలో కఠినంగా వ్యవహరించాల్సిందేనని అన్నారు. రాష్ట్ర ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారని చెప్పారు. కవిత వ్యవహారంలో మెతక వైఖరి అవలంబిస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారని… ఈ అపోహలను తొలగించుకోవాల్సి ఉందని అన్నారు. పార్టీ హైకమాండ్ కు తాను ఇదే విషయాన్ని వివరిస్తానని చెప్పారు.
రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు కేంద్ర మంత్రులు అపాయింట్ మెంట్ ఇవ్వడాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదని కోమటిరెడ్డి అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ ప్రజల్లో కొంచెం మార్పు వచ్చినట్టు కనిపిస్తోందని చెప్పారు. మోదీ, అమిత్ షా తలచుకుంటే తెలంగాణలో ఇప్పటికీ బీజేపీని అధికారంలోకి తెచ్చే అవకాశం ఉందని అన్నారు. తాను కాంగ్రెస్ లో చేరబోతున్నానంటూ మీడియా ఎక్కువ చేసి చూపిస్తోందని వ్యాఖ్యానించారు.