క్రైమ్ వార్తలు

గర్భిణీ తల్లిని తుపాకీతో కాల్చి చంపిన రెండేళ్ల బాలుడు!!

గర్భిణీ తల్లిని తుపాకీతో కాల్చి చంపిన రెండేళ్ల బాలుడు!!

  • అమెరికాలోని ఒహియోలో విషాద సంఘటన
  • ఆడుకుంటూ వెళ్లి ఇంట్లోని తుపాకీ తీసి, వెనుక నుండి తల్లిని కాల్చిన చిన్నారి
  • ఆసుపత్రికి తీసుకు వెళ్లేలోపు కన్నుమూత

రెండేళ్ళ కొడుకు.. గర్భంతో ఉన్న తన తల్లిని తుపాకీతో కాల్చి చంపిన ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. బొమ్మ తుపాకీగా భావించి నిజం తుపాకీతో కాల్చడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. ఒహియో లారా అనే 32 ఏళ్ల మహిళ భర్తతో కలిసి ఉంటోంది. ఆమె ఎనిమిది నెలల గర్భిణీ. వీరికి రెండేళ్ల బాబు ఉన్నాడు. భర్త ఉద్యోగానికి వెళ్లిన సమయంలో తన కొడుకుతో ఒంటరిగా ఇంట్లో ఉంది. ఆ బాబు ఆడుకుంటూ వెళ్లి ఇంట్లో ఉన్న ఓ తుపాకీని బయటకు తీసి ఆడుకోవడం ప్రారంభించాడు. ఇంటి పనుల్లో నిమగ్నమైన ఉన్న తల్లిని వెనుక నుండి కాల్చాడు.

కిందపడిపోయిన లారా… తన భర్తతో పాటు ఎమర్జెన్సీ విభాగానికి ఫోన్ చేసింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రెండేళ్ల బాబు నుండి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే కడుపులో బిడ్డతో సహా మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాఫ్తు చేపట్టారు.

Related posts

బెంగళూరు రేవ్ పార్టీలో కేసులో సినీ నటి హేమ అరెస్ట్…!

Ram Narayana

తాంత్రిక పూజల పేరిట 11 మందిని హత్య చేసిన నాగర్‌కర్నూల్ వ్యక్తి?

Ram Narayana

హైదరాబాదులో 8 ఏళ్ల బాలుడి దారుణ హత్య..

Drukpadam