Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలురాజకీయ వార్తలు

ఖమ్మం జిల్లా రాజకీయాల్లోకి లేడీ సింగం షర్మిల ఎంట్రీ ?…ఉమ్మడి జిల్లాలో సునామినే …

ఖమ్మం జిల్లా రాజకీయాల్లోకి లేడీ సింగం షర్మిల ఎంట్రీ ?…ఉమ్మడి జిల్లాలో సునామినే …
-పొత్తునా? …పార్టీ విలీనమా …?? కొద్దిరోజుల్లో నిర్ణయం
-ఆమెతో చర్చించేందుకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్
-పాలేరు నుంచి పోటీచేయాలని ఆమె పట్టు
-రాజకీయ సమీకరణాల్లో అదికుదరకపోతే ఖమ్మం ఎంపీ గా బరిలోదిగే ఛాన్స్ …!

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లోకి లేడీ సింగం , ఫైర్ బ్రాండ్ గా పేరున్న వైయస్సార్ తనయ షర్మిల ఎంటర్ కాబోతున్నారా …? అంటే మారుతున్న రాజకీయ సమీకరణాలు చూస్తే అవుననే అనిపిస్తుంది . ఆమె ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి పోటీచేస్తానని ఆరునెలల క్రితమే ప్రకటించారు . ఇదే ప్రతిపాదన కాంగ్రెస్ పార్టీ పెద్దల వద్ద ఉంచినట్లు సమాచారం.అయితే అక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ సాధ్యం కాకపోతే ఖమ్మం పార్లమెంట్ నుంచి పోటీచేసే విధంగా ఆమెను ఒప్పించాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం …పొంగులేటి వచ్చి షర్మిల కాంగ్రెస్ లో చేరితే రాజకీసునామి తప్పదని అంటున్నారు రాజకీయ పండితులు …

అందుకే రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పలేము అని అంటారు .నిన్నటివరకు ఉన్న మిత్రులు నేడు శత్రువులు …నేడు శత్రువులుగా ఉన్నవాళ్ళు మిత్రులు అవుతుంటారు …అది నూటికి నూరుపాళ్లు నిజం అనే విధంగా తెలంగాణ రాజకీయాలు ఉన్నాయి. ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైయస్ షర్మిల ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారా …? అంటే అవుననే సమాధానమే వస్తుంది . తెలంగాణాలో వైయస్ సంక్షేమ పాలన తెస్తానని వైయస్సార్ తెలంగాణ పార్టీ పెట్టిన షర్మిల కాంగ్రెస్ రాజకీయాల్లో కీలకం కాబోతున్నారా అంటే అవకాశాన్ని కొట్టి పారేయలేమని అంటున్నారు . రాజకీయ పరిశీలకులు . తెలంగాణ లో 4 వేల కి .మీ పైగా పాదయాత్ర చేసి అనేక ఆటంకాలు , అవమానాలు ఎదుర్కొని అరెస్టులు పోలీస్ కేసులు పెట్టినా, నిర్బంధాలు ప్రయోగించినా, లెక్క చేయకుండా ఉన్న షర్మిల, తన లక్ష్యం నెరవేరాలంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ ను ఓడించగల పార్టీతో పొత్తు కుదుర్చుకోవడమా …? లేక తన పార్టీని అందులో విలీనం చేయడమా …? అనే రెండు మార్గాలు మాత్రమే ఆమె ముందు ఉన్నాయి. మొదట బీజేపీకి సానుకూలంగా ఉన్నారని ప్రచారం జరిగినప్పటికీ ఆమె ఎక్కడ తన అభిప్రాయాలు పంచుకోలేదు . కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీ గ్రాఫ్ పడిపోవడం ,కాంగ్రెస్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరగటం తో కేసీఆర్ ను ఓడించాలంటే కాంగ్రెస్ జతకట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను ఆమె రెండు సార్లు కలిసి రాజకీయాలపై చర్చించారు .ఆమెను కాంగ్రెస్ లోకి రావాలని ఆయన సలహా ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రావాలని కాంగ్రెస్ కోరిందని అందుకు ఆమె నిరాకరించడమే కాకుండా తెలంగాణ రాజకీయాల్లోనే ఉంటానని తన అభిప్రాయాలను చెప్పిందని వినికిడి . అందుకు తగ్గట్లుగానే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యరావు ఠాక్రే కూడా షర్మిల రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవనున్నట్లు వెల్లడించారు . అంతకు ముందే ఖమ్మం మాజీఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో చేరేందుకు నిర్ణయించుకోవడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇప్పుడు షర్మిల స్నేహం లేదా విలీనం కాంగ్రెస్ కు మరింత లాభించే అంశంగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చూద్దాం ఏమిజరుగుతుందో ….!

 

Related posts

దశలవారీగా రైతుబంధు… వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Ram Narayana

మారీచుడు వచ్చి అడ్డుకున్నా రైతు భరోసా ఆగదు …సీఎం రేవంత్ రెడ్డి

Ram Narayana

హైద్రాబాద్ యూటీ అంశంపై లోకసభలో రగడ…

Drukpadam

Leave a Comment