Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలురాజకీయ వార్తలు

తెలంగాణ లో బీజేపీ నాయకత్వ మార్పుపై ప్రచారం…లేదని కొట్టి పారేసిన కిషన్ రెడ్డి , తరుణ్ ఛుగ్…

తెలంగాణ లో బీజేపీ నాయకత్వ మార్పుపై ప్రచారం…లేదని కొట్టి పారేసిన కిషన్ రెడ్డి , తరుణ్ ఛుగ్…
మీడియా ప్రచారమే నన్న కిషన్ రెడ్డి
ఈ కథనాల్లో నిజం లేదన్న తరుణ్ చుగ్
కిషన్ రెడ్డి అధ్యక్షుడు , బండి సంజయ్ కేంద్రమంత్రి , ప్రచార కమిటీ చైర్మన్ గా ఈటెల అంటూ వార్తలు
తెలంగాణ బీజేపీ చీఫ్ గా బండి సంజయ్ కొనసాగుతారని తరుణ్ ఛుగ్ స్పష్టీకరణ
అధ్యక్షుడి మార్పు అంటూ ప్రచారం చేయడం సరికాదన్న తెలంగాణ బీజేపీ ఇన్చార్జి

తెలంగాణాలో డీలా పడ్డ బీజేపీని పైకి లేపేందుకు అధిష్టానం కసరత్తులు చేస్తుంది. నాయకత్వం మార్పులు అంటూ లీకులు ఆపై అలాంటిది ఏమి లేదని ఖండనలు …మొత్తం వ్యవహారం తాము చుట్టూ తిరిగేలా అన్ని రకాల అస్త్రశస్త్రాలను ఉపయోగిస్తున్నారు . అసమ్మతి నేతలుగా ముద్రపడిన ఈటెల , రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ వెళ్లి అమిత్ షా , నడ్డా ను కలవడంలాంటి పరిణామాలు జరిగిపోయాయి. వారు పార్టీ మారుతున్నారంటూ వచ్చిన వార్తల జోరు తగ్గింది. చివరకు ఈటెలపై కేసీఆర్ హత్య యత్నం చేస్తున్నారని అందువల్ల ఆయన” వై ” కేటగిరి తో కేంద్ర ప్రభుత్వ బలగాల భద్రతా కల్పించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది . దీంతో రంగంలోకి దిగిన కేసీఆర్ ప్రభుత్వం ఈటెల కు తగిన భద్రతా కల్పించాలని డీజీపీకి ఆదేశించడం. డీజీపీ స్వయంగా ఒక ఐపీఎస్ అధికారిని ఈటెల ఇంటికి పంపి ఆయన భద్రతపై ఆరాతీయడం జరిగిపోయాయి. మొత్తం వ్యవహారాలను బీజేపీ ,బీఆర్ యస్ చుట్టూ తిప్పే ప్రయత్నం జరిగింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎవరకి ఎంతవరకు ప్రయోజనం జరిగిందో తెలియదు కానీ బీఆర్ యస్ కు బీజేపీకి ఎదో సంబంధాలు ఉన్నాయనే సందేహాలకు బలం చేకూరింది .

బీజేపీ ఎన్ని ఎత్తులు వేసిన తెలంగాణలో అధికారం రావడం జరిగే పనికాదని ప్రజల్లో బలంగా ఉంది. బీజేపీ ,బీఆర్ యస్ ఒకటే అనే సంకేతాలు వెళ్లాయి. అందుకు తగ్గట్లుగానే బీజేపీలోనే ఈ వాదనలు వినిపించడం గమనార్హం . లిక్కర్ స్కాం లో కవిత , కాళేశ్వరం అవినీతిలో సీఎం కేసీఆర్ ఉన్నారని ఊరూరా తిరిగి ప్రచారం చేసి వాళ్ళు జైలుకు వెళ్లడం ఖాయమన్న బండి సంజయ్ మాటలు ఉత్తర కుమార ప్రగల్బాలుగానే మిగిలాయనే అభిప్రాయాలు ఉన్నాయి.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడ్ని మార్చుతున్నారని, రాష్ట్ర బీజేపీలో సంచలన పరిణామాలు చోటుచేసుకోనున్నాయని జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ బీజేపీ ఇన్చార్జి తరుణ్ చుగ్ స్పందించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు ఉండదని ఫోన్ ద్వారా స్పష్టం చేశారు. బీజేపీ తెలంగాణ చీఫ్ గా బండి సంజయ్ కొనసాగుతారని వెల్లడించారు. ఇదే విషయాన్నీ కేంద్ర మంత్రి తెలంగాణ కు అధ్యక్షుడు గా నియమించబడ్డారని ప్రచారం జరిగిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సైతం ఖండించారు . ఇది అంత మీడియా సృష్టేనని నవ్వుతు అన్నారు .

అధ్యక్షుడి మార్పు అంశంపై పదే పదే ప్రచారం చేయడం సరికాదని తరుణ్ చుగ్ అన్నారు. అధ్యక్షుడిని మార్చే అవసరం లేదని కొట్టి పారేశారు . దీనిపై ఇంతకుముందే స్పష్టత ఇచ్చామని, అయినా ఎందుకు ప్రచారం చేస్తున్నారో అర్థం కావడంలేదని తెలిపారు. 

కాగా, ఇటీవల పరిణామాల నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నాయకత్వ మార్పు తథ్యమని కొన్ని కథనాలు, బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి ఇస్తున్నారంటూ , ఈటెలకు ప్రచార కమిటీ చైర్మన్ అంటూ మరికొన్ని కథనాలు రావడం తెలిసిందే…మొత్తం మీద బీజేపీలో గందరగోళం మాత్రం నెలకొన్నదనే అభిప్రాయాలు ఉన్నాయి…వాటిపై బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి ..!

Related posts

28 కి .మీ ప్రయాణానికి సీఎం జగన్ హెకాఫ్టర్ ఉపయోగించడంపై జనసేన నేత నాదెండ్ల విమర్శలు …

Drukpadam

నేను ‘సారాయి వీర్రాజు’ కాదు…

Drukpadam

కేసీఆర్ బీఆర్ యస్ పెట్టడంలో కుట్రకోణం దాగిఉంది…పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

Drukpadam

Leave a Comment