Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మం లో తెలంగాణ గర్జనకు 5 లక్షలమంది …

తెలంగాణ జనగర్జన సభను జయప్రదం చేయండి…టార్గెట్ 5 లక్షలు..
-కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్ రావు ఠాక్రే
-పొంగులేటితో కలిసి సభాస్థలి పరిశీలన
-పొంగులేటి నివాసంలో మీడియా సమావేశం
-సభకు వచ్చిన జనాన్ని చూసి పొంగులేటి బీఆర్ యస్ నేతల గుండెలు ఆదరటం ఖాయం….పొంగులేటి

ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఆయన అనుచర బృందం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా జూలై 2న ఆదివారం ఖమ్మంలో నిర్వహించనున్న తెలంగాణ జనగర్జన సభను జయప్రదం చేయాలని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్ రావు ఠాక్రే ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ శ్రేణులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా పర్యటనకు గురువారం వచ్చిన ఠాక్రే తొలుత ఖమ్మం జిల్లా సరిహద్దున ఉన్న పీపుల్స్ మార్చ్ పాదయాత్రను దిగ్విజయంగా నిర్వహిస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ని కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఠాక్రే కు పొంగులేటి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం ఖమ్మంలోని ఎస్ ఆర్ గార్డెన్స్ గ్రౌండ్ వద్ద తెలంగాణ జనగర్జన సభా వేదికను పొంగులేటి, జిల్లా కాంగ్రెస్ నేతలతో కలిసి ఠాక్రే పరిశీలించారు. అనంతరం పొంగులేటి క్యాంప్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఠాక్రే మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలోకి పొంగులేటి రాకను స్వాగతిస్తున్నామన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్యఅతిథిగా
ఖమ్మం సభకు హాజరుకానున్న నేపథ్యంలో ఈ సభకు అంచనాకు మించి జనం వచ్చే అవకాశం ఉ న్నందున అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు హాజరువుతారని తెలిపారు. స్థానికి నేతలు 5 లక్షలుగా టార్గెట్ పెట్టుకోవడం గమనార్హం….

బీఆర్ఎస్ నేతల గుండెలు పగిలిపోవడం ఖాయం: పొంగులేటి

బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఖమ్మంలో నిర్వహించి ఆహా ఒహో అన్నారని, రాని జనాన్ని కూడా వచ్చినట్లు అంకెల్లో చూపి సంకలు గుద్దుకున్నారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కానీ జూలై 2న ఖమ్మంలో జరిగే తెలంగాణ జనగర్జనకు జనం ఎంతమంది వస్తారో మేము లెక్కేసి చెప్పడం కాదు మీరే లెక్కపెట్టుకోండని, ఖచ్చితంగా ఆ సభను చూసిన తరువాత బీఆర్ఎస్ నేతల గుండెలు పగిలిపోవడం ఖాయమని పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ జన గర్జన సభ కనివినీ ఎరుగని రీతిలో ప్రజల ఆశీస్సులతో విజయవంతంగా జరిగి తీరుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఏఐసిసి సెక్రెటరీ రోహిత్ చౌదరి, మాజీ మంత్రి సంభాని చంద్ర శేఖర్ , పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి , విజయ బాయి , పార్టీ జిల్లా అధ్యక్షులు దుర్గా ప్రసాద్, ఖమ్మం నియోజకవర్గ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్ తదితరులు ఉన్నారు.

Related posts

ఎవరు ముఖ్యమంత్రి ….సిద్దరామయ్య నా ..? డీకే శివకుమార్ నా….??

Drukpadam

కేసీఆర్ నాందేడ్ సభకుమిత్రులను ఎందుకు పిలవలేదు …?

Drukpadam

సాగు చట్టాలు బాగు బాగు …. ప్రతిపక్షాలదే తప్పుడు ప్రచారం బీజేపీ ఎంపీ జీవీఎల్…

Drukpadam

Leave a Comment