Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలురాజకీయ వార్తలు

పాదయాత్ర “బంధం”…ఆత్మీయలోకనం…క్షేత్రస్థాయి సిబ్బందితో భట్టి మాట మంతి…

పాదయాత్ర “బంధం”…ఆత్మీయలోకనం…క్షేత్రస్థాయి సిబ్బందితో భట్టి మాట మంతి…
-సహకరించిన సిబ్బందికి శాల్యూట్ ….చేసిన భట్టి
-సత్కరించి, సహపంక్తి భోజనం చేసిన సీఎల్పీ నేత భట్టి
-పాదయాత్రను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు
-3 నెలల 19 రోజుల యాత్ర …1365 కి . మీ 38 నియోజకవర్గాలు
-మూడు పెద్ద సభలు …వందలాదిగా కార్నర్ మీటింగ్ లు

పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో క్రియాశీలకంగా క్షేత్రస్థాయిలో పాల్గొన్న సిబ్బందితో సోమవారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆత్మీయ సమావేశం నిర్వహించి వారితో సహాపంక్తి భోజనం చేశారు. సామాన్యుడిగా పాదయాత్ర నిర్వహించిన భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ లో టెంటు వేసిన శ్రామికులు, చక్కటి భోజనం అందించిన వంట మనుషులు, వాహనాల డ్రైవర్లు, బౌన్సర్లు, వ్యక్తిగత సిబ్బంది, కళాకారులు, డీజే సిస్టం ఆపరేటర్స్, తనతో పాటు నడిచిన పాదయాత్రికులు, పాదయాత్ర క్యాంపు నిర్వహకులు ఇలా అనేక కీలక బాధ్యతలు నిర్వహించిన ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరించి వారికి భట్టి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారి యోగక్షేమాలను ,కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు 109 రోజుల పాటు 1365 కి .మీ జరిగిన ఈ యాత్రకు ముందు అనుకున్న దానికంటే ఎక్కువ స్పందన వచ్చింది. మూడు పెద్ద సభలు , వందల కార్నర్ మీటింగ్ లు జరిగాయి …లక్షలాది మందికి ప్రత్యక్షంగా ,కోటిమందికి పైగా పరోక్ష సందేశం ఇచ్చిన భట్టి …

పాదయాత్రలో ఎదురైన అనుభవాలు వారు పొందిన స్ఫూర్తి, జ్ఞాపకాలను ఈ సందర్భంగా పంచుకున్నారు. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఆరోగ్యం క్షీణించిన లెక్కచేయకుండా చేసిన పాదయాత్రలో ఆయా గ్రామాల్లో ప్రజలను కదిలించిన సన్నివేశాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి సిబ్బందిని భట్టి విక్రమార్క దుశ్శాలువా కప్పి సత్కరించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గాలి బాలాజీ ఆత్మీయ సమావేశంలో భట్టి దంపతులను పోచంపల్లి పట్టు శాలువాను కప్పి సత్కారం చేసి శుభాకాంక్షలు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరావు, ఖమ్మం డిసిసి అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పాదయాత్ర కన్వీనర్ బుల్లెట్ బాబు, ఓయూ జెఏసి రాష్ట్ర అధ్యక్షులు లోకేష్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ రవిబాబు, ఖమ్మం ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, పాదయాత్రికులు కల్తీ వెంకట్, డి రాజీవ్ గాంధీ, వేణు, అంజన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు: భట్టి

పీపుల్స్ మార్చ్ పాదయాత్ర తో పాటు ఖమ్మంలో నిర్వహించిన జనగర్జన బహిరంగ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కృతజ్ఞతలు తెలిపారు. మార్చి 16న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం, పిప్పిరి గ్రామం నుంచి ప్రారంభమై జులై 02న ఖమ్మం వరకు సాగిన 109 రోజుల పాదయాత్రలో పాల్గొన్న ప్రజలకు సహకరించిన ఏఐసీసీ, పీసీసీ, డిసిసి, బ్లాక్, మండల, గ్రామ శాఖ నాయకులకు, పార్టీ అనుబంధ సంఘాల శ్రేణులకు, సంఘీభావం తెలిపిన సామాజికవేత్తలు, ఇతర రాజకీయ పార్టీల నాయకులు, యువజన సంఘాల సభ్యులకు, విస్తృతంగా మీడియా కవరేజ్ చేసిన జర్నలిస్టు మిత్రులందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు చెప్పారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించిన వాటన్నిటిని అధిగమించి ఎదురోడ్డి పాదయాత్ర ముగింపు సందర్భంగా ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన తెలంగాణ జన గర్జన సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

భట్టి ఇంటిదగ్గర సంబరాలు …

భట్టి పాదయాత్ర ముగించుకొని మొదటిసారిగా ఇంటికి వచ్చిన సందర్భంగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు . బాణాసంచా కాల్చారు . భట్టి సతీమణి నందిని ,కుమారుడు భట్టికి ఆప్యాయ స్వాగతం పలికారు .హారతులు ఇచ్చారు .

Related posts

కాంగ్రెస్ లో పెద్ద చేపలకు బీఆర్ యస్ వల…!

Drukpadam

బీజేపీలో చేరుతున్నట్లు నాపై దుష్ప్రచారం :టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్…

Drukpadam

హిందూ జనాభా అధికంగా ఉన్న చోట ముస్లిం స్వతంత్ర అభ్యర్థి గెలుపు…!

Drukpadam

Leave a Comment