Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలురాజకీయ వార్తలు

ఖమ్మం సభద్వారా రాహుల్ కు పరిపక్వత లేదని మరోసారి రుజువైంది…..మంత్రి పువ్వాడ అజయ్!

ఖమ్మం సభద్వారా రాహుల్ కు పరిపక్వత లేదని మరోసారి రుజువైంది…..మంత్రి పువ్వాడ అజయ్!
-అడ్డగోలు ఆరోపణలతో పరువు పోగుట్టుకుంటున్నారు ..
-స్క్రిప్ట్ రాసిస్తే చదవడం కాదు …విషయాలు తెలుసుకొని మాట్లాడాలి
-ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 కి 9 సీట్లు ఖాయం

సభలో  భట్టికి అవమానం….సత్తుపల్లి ఎమ్మేల్యే. సండ్ర వెంకట వీరయ్య

తెలంగాణకు కేసీఆర్ శాశ్వత ముఖ్యమంత్రి…వద్దిరాజు రవిచంద్ర, ఎంపీ.

ఎవరెన్ని కుప్పిగంతులు వేసిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 10 అసెంబ్లీ సీట్లలో 9 రావడం ఖాయమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు . ఖమ్మం సభలో రాహుల్ చేసిన ప్రసంగం తో
ఆయనకు రాజకీయాల్లో పరిపక్వత లేదని మరోసారి రుజువైందని విమర్శలు గుప్పించారు . అడ్డగోడు ఆరోపణలు చేసి పరువు పోగొట్టుకుంటున్నాడని దెప్పిపొడిచారు . హైద్రాబాద్ లో అసెంబ్లీ హాల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత రెడ్డి , ఎంపీ వద్దిరాజు రవిచంద్ర , ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలతో కలిసి మాట్లాడుతూ రాహుల్ గాంధీ ప్రసంగం పై ధ్వజమెత్తారు. కాళేశ్వరంలో 80 కోట్లకు పనులు జరిగితే లక్ష కోట్లు అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు . తలకాయలేని రాష్ట్ర నేతలు ఇచ్చిన స్క్రిప్ట్ చదివితే ఆబాసు పాలు కావడం ఖాయమని పువ్వాడ అన్నారు . భారత్ జోడో యాత్ర తర్వాత తెలివి వచ్చిందని అనుకుంటే , తెలివి తెల్లారినట్లుగా మాట్లుడుతున్నారని ఎద్దేవా చేశారు .కాంగ్రెస్ ను మించిన కుటుంబ అవినీతి పార్టీ ఏదైనా ఉందా.. రాహుల్ కు అసలు లెక్కలు వచ్చా.. కాళేశ్వరం లో అవినీతి జరగలేదని మీ ఎంపీ ఉత్తమ్ ప్రశ్న వేస్తే పార్లమెంటులో కేంద్రమే బదులు ఇచ్చిన విషయం మరిచిపోయారా ..?అని అన్నారు .

తెలంగాణకు ద్రోహం చేసిన పార్టి కాంగ్రెస్. 2009 లో తెలంగాణ ప్రకటన చేసి యూ టర్న్ తీసుకుంది కాంగ్రెస్ పార్టి కాదా. కాంగ్రెస్ కల్లి బొల్లి కబుర్లకు తెలంగాణ లొంగదు. ఖమ్మంలో కాంగ్రెస్ లో చేరిన వారంతా అవకాశవాదులే.. పొంగులేటితో సహా ఎవరికీ కేసీఆర్ గారు అన్యాయం చేయలేదు.

ఈ సారి ఖమ్మంలో బీఆర్ఎస్ తొమ్మిది సీట్లు గెలిచి చరిత్ర సృష్టిస్తుంది. ప్రజలు కేసీఆర్ నే గతంలో నమ్మారు.. నమ్ముతారు… కాంగ్రెస్ ను గతంలో నమ్మలేదు.. ఇక నమ్మరని అన్నారు . కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారు. ఎవ్వరూ ఆపలేరు పువ్వాడ సవాల్ చేశారు .

4వేల పెన్షన్ ను దమ్ముంటే దేశమంతా ప్రకటించాలి. కాంగ్రెస్ అంటేనే స్కాం ల పార్టీ.అందుకే దాన్ని ఇంటికి పంపించారని ప్రజలు మరిచిపోయారనుకుని ప్రజలను మోసం చేసేందుకు అబద్దాలు చెప్పడం సరికాదని అన్నారు . ఖమ్మం లో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ కు వచ్చిన జనమే రికార్డు. దాంతో పోలిస్తే నిన్నటి కాంగ్రెస్ సభ లెక్కలోకే రాదని పువ్వాడ కొట్టి పారేశారు ..

వద్దిరాజు రవిచంద్ర, ఎంపీ.

ఖమ్మం కాంగ్రెస్ సభ కు రాష్ట్ర మంతటి నుంచి జనం సమీకరిస్తే ఆ మాత్రం వచ్చారు.. కాంగ్రెస్ నేతలు ఆ జనాన్ని చూసి జబ్బలు చరచుకోవద్దని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు . జాతరలకు కూడా జనం వస్తారు. గతంలో చిరంజీవి సభలకు కూడా జనం వచ్చారు. ఓట్లు వేయని విషయాన్నీ గుర్తుంచుకోవాలని అన్నారు . తెలంగాణలో ఓట్లు పడేది. కేసీఆర్ కు మాత్రమే. తెలంగాణకు కేసీఆర్ శాశ్వత ముఖ్యమంత్రి. కాంగ్రెస్ హామీలకు తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు . అభివృద్ధి, సంక్షేమం రాష్ట్రంలో పరుగులు పెట్టాలంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వద్దిరాజు పేర్కొన్నారు .

సత్తుపల్లి ఎమ్మేల్యే. సండ్ర వెంకట వీరయ్య

ఖమ్మం సభలో కాంగ్రెస్ కలహాలు బయట పడ్డాయి. మున్ముందు కాంగ్రెస్ నేతల గ్రూపు కలహాలు మరింత బయట పడతాయి. భట్టికి సభలో అవమానం జరిగిందని సత్తుపల్లి ఎమ్మేల్యే. సండ్ర వెంకట వీరయ్య అభిప్రాయపడ్డారు .
ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ఎట్టి పరిస్థితిలో గెలిచే పరిస్థితి లేదని అన్నారు . ఒకరకంగా చెప్పాలంటే ఖమ్మం సభ ద్వారా వారి విభేదాలు బయటపడ్డాయని తెలిపారు …

Related posts

తెలంగాణలో బంజారా బిడ్డలే అత్యాచారానికి గురవుతున్నారు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్!

Drukpadam

పోలవరం విషయంలో కేంద్రం తొండాట …నిధులపై చేతులు వెత్తేసేదిశగా అడుగులు…

Drukpadam

పార్టీకి సోనియా భారీ శస్త్రచికిత్స చేస్తున్నారు.. ఇక జి-23తో పనిలేదు: వీరప్ప మొయిలీ

Drukpadam

Leave a Comment