Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

ఫేక్ నోటుతో డాక్టర్ ను బురిడీ కొట్టించిన రోగి…

ఫేక్ నోటుతో డాక్టర్ ను బురిడీ కొట్టించిన రోగి…

  • కన్సల్టేషన్ ఫీజు కింద రూ.500 నకిలీ నోటు ఇచ్చిన వైనం
  • తాను ఎలా మోసపోయిందీ సోషల్ మీడియాలో వివరించిన డాక్టర్
  • అది ఫేక్ నోటు అని ఆ రోగికి కూడా తెలిసి ఉండదని కామెంట్

గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి మొబైల్ యాప్ లు అందుబాటులోకి వచ్చాక చాలామంది డిజిటల్ పేమెంట్లకే మొగ్గు చూపుతున్నారు. మొబైల్ ఫోన్ తోనే చెల్లింపులు పూర్తిచేస్తుండడంతో నోట్లు కావాల్సి వచ్చినపుడు జేబులు వెతుక్కోవాల్సిన పరిస్థితి చాలామందికి అనుభవంలోకి వచ్చే ఉంటుంది. నగదు చెల్లింపులు చేసే వారు తగ్గడంతో నోట్లను పరిశీలించి చూసే వారి సంఖ్య తగ్గుతోంది. దీంతో ఓ రోగి ఏకంగా వైద్యుడినే బోల్తా కొట్టించాడు. నకిలీ నోటు ఇచ్చి ఎంచక్కా వైద్యం చేయించుకుని వెళ్లిపోయాడు.

ఆ తర్వాత కానీ అది నకిలీ నోటు అని వైద్యుడు గుర్తించలేకపోయాడు. సదరు డాక్టర్ ఈ విషయాన్ని ఫొటోతో సహా సోషల్ మీడియాలో పెట్టడంతో అదికాస్తా వైరల్ గా మారింది. అయితే, అది నకిలీ నోటు అని ఆ పేషెంట్ కు కూడా తెలిసి ఉండదని, వేరెవరో ఇచ్చిన నోటును తనకు ఇచ్చి ఉంటాడని డాక్టర్ మానవ్ అరోరా తన పోస్టులో చెప్పుకొచ్చారు.

డాక్టర్ మానవ్ అరోరా ఆర్థోపెడిక్ సర్జన్ గా రోగులకు సేవలందిస్తున్నారు. ఇటీవల ఆయన దగ్గరికి వచ్చిన ఓ రోగి కన్సల్టేషన్ ఫీజు కింద రూ.500 నోటు ఇచ్చాడు. ఆ సమయంలో రిసెప్షనిస్ట్ నోటును పరిశీలించకుండానే తీసుకుంది. సదరు రోగి డాక్టర్ ను కలిసి, మందులు రాయించుకుని వెళ్లిపోయాడు. సాయంత్రం డబ్బుల లెక్కలు చూస్తుండగా నకిలీ 500 నోటును గుర్తించినట్లు డాక్టర్ మానవ్ చెప్పారు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించి నవ్వుకున్నట్లు తెలిపారు. ఆ నకిలీ నోటును తాను భద్రంగా దాచుకుంటానని డాక్టర్ మానవ్ అరోరా చెప్పారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. డాక్టర్ మానవ్ అరోరా స్పోర్టివ్ నెస్ ను మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.

Related posts

11 ఏళ్ల బాలుడు ఫ్లైట్ నడపగా పక్కనే మందుకొట్టిన తండ్రి.. కూలిపోయిన విమానం

Ram Narayana

అస్సాంలో కొనసాగుతున్న భర్తల అరెస్టుల పర్వం.. కారణం ఇదే!

Drukpadam

చంద్రయ్య హత్యను రాజకీయం చేయొద్దు: గుంటూరు రూరల్ ఎస్పీ విజ్ఞప్తి!

Drukpadam

Leave a Comment