Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఆధునికం పేరుతో అల్లోపతి ప్రాణాలు బలిగొంటుంది- బాబా రాందేవ్ మండిపడ్డ వైద్యవర్గాలు

మీ వివరణ సరిపోదు… మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిందే: బాబా రాందేవ్ కు స్పష్టం చేసిన కేంద్రం

  • అల్లోపతి వైద్యంపై బాబా రాందేవ్ వ్యాఖ్యలు
  • దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం
  • భగ్గుమన్న వైద్య వర్గాలు
  • వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిన రాందేవ్
  • రెండు పేజీల లేఖ రాసిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి

అల్లోపతి వైద్యంపై ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేకెత్తించాయి. కరోనా వైరస్ కంటే అల్లోపతి వంటి ఆధునిక చికిత్స వైద్య విధానాలే ప్రజలను బలిగొంటున్నాయని రాందేవ్ వ్యాఖ్యానించారు. దీనిపై వైద్య వర్గాలు భగ్గుమనడంతో రాందేవ్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే, రాందేవ్ వివరణ ఇస్తే సరిపోదని, తన వ్యాఖ్యలను పూర్తిగా వెనక్కి తీసుకోవాల్సిందేనని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ స్పష్టం చేశారు.

“అల్లోపతి వైద్యంపై మీరు చేసిన వ్యాఖ్యలు దేశ ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ విషయాన్ని మీకు ఇప్పటికే ఫోన్ ద్వారా తెలియజేశాను. ప్రాణాలకు తెగించి కరోనాతో పోరాడుతున్న డాక్టర్లు, ఆరోగ్య సిబ్బందిని దేశ ప్రజలు దేవుళ్లుగా భావిస్తున్నారు. మీరు కరోనా వారియర్స్ ను మాత్రమే అవమానించలేదు… యావత్ ప్రజానీకం మనోభావాలను గాయపరిచారు. మీరు నిన్న ఇచ్చిన వివరణ ఏమాత్రం సరిపోదు. మీరు దీనిపై గట్టిగా ఆలోచించి, మీ వ్యాఖ్యలను పూర్తిగా వెనక్కి తీసుకుంటారని భావిస్తున్నాను” అంటూ స్పష్టం చేశారు. ఈ మేరకు బాబా రాందేవ్ కు హిందీలో రెండు పేజీల లేఖ రాశారు

Related posts

10 నెలలుగా జీతాలులేని ప్రభుత్వహాస్పిటల్ అవుట్ సోర్సింగ్ కార్మికులు

Drukpadam

వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి లండన్ హైకోర్టులో ఎదురుదెబ్బ!

Drukpadam

తల్లి సత్యం.. తండ్రి అపోహ.. రాజయ్యకు వర్తించదా?: కడియం సూటి ప్రశ్న

Drukpadam

Leave a Comment