Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాజ్యసభలో బీజేపీకి మెజార్టీ సాధ్యమేనా….?

రాజ్యసభలో బీజేపీకి మెజార్టీ సాధ్యమేనా….?
-245 మంది సభ్యులు ఉన్న రాజ్యసభలో బీజేపీకి కేవలం 93 మంది సభ్యులే
-మెజార్టీ కావాలంటే 123 సభ్యుల అవసరం-మోజార్టీకి మరో 30 సభ్యుల అవసరం
-కీలకంకానున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికలు
-అక్కడ బీజేపీకి చావోరేవో
-వచ్చే ఏడాది 71 మంది రిటైర్
-వైసీపీ ఖాతాలో మరో మూడు
– టీడీపీ నుంచి బీజేపీ లోకి పార్టీ ఫిరాయించిన నలుగురు అవుట్
-అందులో ముగ్గురు ఆంధ్రప్రదేశ్ నుంచే

రాజ్యసభలో బీజేపీ మెజార్టీ సాధించటం సాధ్యమేనా ? అంటే కాదనే అంటున్నారు పరిశీలకులు .245 మంది సభ్యులు ఉన్న రాజ్యసభలో బీజేపీకి మెజార్టీ కావాలంటే 123 మంది సభ్యులు కావాలి .ప్రస్తుతం బీజేపీకి రాజ్యసభలో 93 మంది సభ్యులు ఉన్నారు. మెజార్టీ కావాలంటే మరో 30 మంది కావాలి . 30 మందిని గెలిపించుకోవడం బీజేపీకి అంత తేలికైన విషయం కాదు . ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికలలో పశ్చిమ బెంగాల్ ,తమిళనాడుపై ఆశలు పెట్టుకున్న బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమ బెంగాల్ తమఖాతాలోకి వచ్చినట్లే అని ప్రధానితోసహా బీజేపీ నేతలందరూ భావించారు.అదే విధంగా ప్రచారం చేశారు. బెంగాల్ లో ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చునేది బీజేపీ నేతనే అని బల్లగుద్ది వాదించారు. అక్కడ ఓటమి బీజేపీని కుంగదీసింది. మోడీ ప్రభ మసకబారుతుందని ప్రచారం జరుగుతున్నా నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఒక్క అసోం మినహా మిగతా రాష్ట్రాలలో ఓటమి చెందటం ఒకింత ఆందోళనకు గురిచేసింది.
పార్లమెంటులో భారీ మెజారిటీతో 2014లో అధికారం చేపట్టిన మోడీ సర్కార్‌ దిగ్విజయంగా ఏడేళ్ల పాలన పూర్తి చేసుకుంది. అయినా దిగువ సభ అయిన లోక్‌సభలో భారీ మెజారిటీ ఉన్నప్పటికీ రాజ్యసభలో మాత్రం ఈ ఏడేళ్లలో మెజారిటీ సాధించలేక పోయింది . ఎప్పటికప్పుడు మెజారిటీకి చేరవవుతున్నట్లు కనిపిస్తున్నా మ్యాజిక్‌ మార్క్ మాత్రం అందని ద్రాక్షే అవుతోంది. దీనికి ప్రధాన కారణం రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురవుతున్న పరాజయాలే. వచ్చే ఏడాది జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవకపోతే మెజారిటీ మాట అటుంచి ప్రస్తుతం ఉన్న సభ్యుల సంఖ్య కూడా కోల్పోక తప్పదు.

 

245 మంది సభ్యులున్న రాజ్యసభలో బీజేపీకి ఉన్న ప్రస్తుత సభ్యుల సంఖ్య 93 మాత్రమే. ఈ ఏడేళ్లలో పలు రాష్ట్రాల ఎన్నికల్లో ఘనవిజయాలు అందుకున్నా అంతకంటే ఎక్కువ సంఖ్యలో పరాజయాల్ని కాషాయ పార్టీ మూటగట్టుకుంది. దీంతో బీజేపీకి రాజ్యసభలో మజారిటీ మార్క్‌ సాధించడం అనేది అందని ద్రాక్షగా మారిపోతోంది. ఇప్పటికీ రాజ్యసభలో మెజారిటీకి అవసరమైన 123 సభ్యుల మార్క్‌కు 30 ఎంపీల దూరంలో ఉన్న బీజేపీ ఇప్పట్లో దాన్ని అందుకునే అవకాశాలు కనిపించడం లేదు.

మరో 9 నెలల్లో జరగాల్సిన యూపీ ఎన్నికలు బీజేపీకి రాజ్యసభలో చాలా కీలకంగా మారబోతున్నాయి. యూపీలో యోగి ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను ఎదుర్కొంటుంది. అందువల్ల బీజేపీకి వచ్చే ఏడాది జనవరిలో జరిగే యూపీ ఎన్నికల్లో గెలుపు అంత తేలికగా ఉండకపోవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. . ప్రతిపక్షాలు క్రమంగా ఐక్యమవుతుండటం, ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత యూపీలో బీజేపీ పుట్టి ముంచేలా ఉన్నాయి. అదే జరిగితే వచ్చే ఏడాది యూపీ ఎన్నికల తర్వాత బీజేపీ ప్రస్తుతం రాజ్యసభలో ఉన్న 93 సభ్యుల సంఖ్యను నిలబెట్టుకోవడం కూడా కష్టంగా మారనుంది. యూపీలో 11 రాజ్యసభ సీట్లు వచ్చే ఏడాది ఖాళీ అవుతుండగా..ఇందులో బీజేపీకి చెందిన ఐదుగురు ఎంపీలున్నారు. వీరిలో ఇద్దరు సమాజ్‌వాదీ పార్టీ నుంచి ఫిరాయించినవారే. యూపీ ఎన్నికల్లో ఓడితే ఈ ఐదు సీట్లపై ఆశలు వదులుకోవడమే.

వచ్చే ఏడాది ఏకంగా 71 మంది రాజ్యసభ ఎంపీలు మూడు విడతల్లో పదవీ కాలాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఇందులో ఏపీ, రాజస్తాన్, ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన ఎంపీలున్నారు. అసలే ఏపీలో సొంతంగా ఒక్క ఎంపీని కూడా గెల్చుకోలేని పరిస్దితుల్లో టీడీపీ ఎంపీల్ని లాక్కున్న బీజేపీ.. ఇప్పుడు తమకున్న నలుగురు ఎంపీల్ని కోల్పోనుంది. అలాగే రాజస్ధాన్‌, ఛత్తీస్‌ఘడ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి అక్కడా రిటైర్‌ అవుతున్నఎంపీల స్దానంలో మరోసారి ఎంపీల్ని గెల్చుకునే అవకాశాలు లేవు. ఇలాంటి పరిస్ధితుల్లో యూపీలో తేడా కొడితే మాత్రం ప్రస్తుత సంఖ్యను సైతం బీజేపీ కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది.

వచ్చే ఏడాది ఏపీ, తెలంగాణలో బీజేపీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్‌, టీజీ వెంకటేష్‌, గరికపాటి మోహన్‌రావు రిటైర్‌ కానున్నారు. వీరిలో ఏపీకి చెందిన ముగ్గురు ఎంపీల స్ధానాల్లో వైసీపీ పాగా వేయబోతోంది. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో భారీ మెజారిటీతో పటిష్టంగా ఉన్న వైసీపీ ఈ మూడు స్ధానాల్ని కచ్చితంగా కైవసం చేసుకోవడం ఖాయం. అలాగే తెలంగాణలో సైతం టీఆర్‌ఎస్‌ బీజేపీకి చెందిన ఎంపీ సీటును కైవసం చేసుకోవడం ఖాయమే. దీంతో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ రాజ్యసభ ఎంపీలు మాయమైనట్లే.

Related posts

బొత్స సంగతి సరే… చంద్రబాబు దగ్గర నువ్వేం చేస్తున్నావు?: పేర్ని నాని!

Drukpadam

ఇంతకీ ఎంపీ శశిథరూర్ కాంగ్రెస్ లో ఉన్నట్టా ? లేనట్టా ?

Drukpadam

వికేద్రీకరణ పై ఏపీ వ్యూహాత్మక అడుగులు …పూర్తిసమగ్రమైన మెరుగైన బిల్లు తెస్తాం :సీఎం జగన్

Drukpadam

Leave a Comment