Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఛత్తీస్ ఘడ్ లో ఇంటివద్దనే ఓపెన్ బుక్ పరిక్ష విధానం …

కరోనా వేళ చత్తీస్ గఢ్ వినూత్న నిర్ణయం
-విద్యార్థులకు ఇంటివద్దనే పరీక్షలు
-దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ
-విద్యాసంస్థలు మూసివేత
-పరీక్షలు వాయిదా
-ఓపెన్ బుక్ విధానంలో పరీక్షలకు చత్తీస్ గఢ్ నిర్ణయం
ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం విద్యార్థులకు వినూత్న రీతిలో పరీక్షలు నిర్యహించేందుకు నిర్ణయం తీసుకుంది. అందుకుగాను ఇంటివద్దనే పరీక్షలు ఓపెన్ బుక్ విధానం అని ప్రకటించింది.దానికి నిర్ణయ గడువును సైతం ప్రకటించింది .
కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యాసంస్థల నిర్వహణ, పరీక్షలు చేపట్టేందుకు వీల్లేకపోవడంతో చత్తీస్ గఢ్ ప్రభుత్వం ఆసక్తికర నిర్ణయం దేశవ్యాపితంగా చర్చనీయాంశంగా మారింది. 12వ తరగతి విద్యార్థులకు ఇంటివద్ద నుంచే పరీక్షలు రాసే వెసులుబాటు కల్పించింది. రాష్ట్రంలో 2.90 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ ఓపెన్ బుక్ పరీక్ష విధానానికి సంబంధించిన మార్గదర్శకాలను చత్తీస్ గఢ్ ప్రభుత్వం నేడు విడుదల చేసింది.విద్యార్థులు సంతోషము వ్యక్తం చేస్తున్నారు.

ఆ మార్గదర్శకాలు ఏంటంటే…

ఓపెన్ బుక్ విధానంలో విద్యార్థి పరీక్ష రాయాల్సి ఉంటుంది.
విద్యార్థి జూన్ 1 నుంచి 5వ తేదీ లోపు పరీక్ష పత్రాన్ని తీసుకెళ్లవచ్చు.
పరీక్ష రాసిన 5 రోజులకు జవాబు పత్రాలను ఇన్విజిలేటర్ కు సమర్పించాలి.
ఉదాహరణకు జూన్ 1న ప్రశ్నాపత్నం తీసుకెళ్లిన విద్యార్థి సమాధాన పత్రాలను జూన్ 6న సమర్పించాల్సి ఉంటుంది.
సమాధాన పత్రాలను స్వయంగా తీసుకెళ్లి తమ స్కూళ్లలోని ఇన్విజిలేటర్ కు అందించాలి. పోస్టులో పంపడం నిషిద్ధం.
జూన్ 1 నుంచి 5వ తేదీ మధ్యలో ఆన్సర్ కీని కూడా పొందవచ్చు.

Related posts

పొంగులేటి కాంగ్రెస్ లోకేనా….? రాష్ట్ర రాజధానిలో జోరుగా చర్చలు…

Drukpadam

ఇరాన్​ లో భారీ భూకంపం.. కూలిన వందల ఇళ్లు..

Drukpadam

కేరళలో బర్డ్ ఫ్లూ కేసుల కలకం …అనేక బర్డ్స్ హననం !

Drukpadam

Leave a Comment