Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఎవరు దొర …నేనా నువ్వా పొంగులేటిపై సండ్ర నిప్పులు…!

ఎవరు దొర …నేనా నువ్వా పొంగులేటిపై సండ్ర నిప్పులు…!
గన్ మెన్ల రక్షణ , హెలీకాఫ్టర్లలో షికార్లు …
నేను సత్తుపల్లిలో పోటీచేస్తాను ..కేసీఆర్ టికెట్ కన్ఫర్మ్ చేశారు
నువ్వు ఎక్కడ పోటీచేస్తావో చెప్పే దమ్ము లేదు

ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గంలో ఆదివారం పర్యటించిన రాష్ట్ర కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే వెంకట వీరయ్య పై విమర్శలు గుప్పించారు . కేసీఆర్ రాష్ట్రానికి దొర అయితే ,సత్తుపల్లికి ఎమ్మెల్యే దొరలా వ్యవహరిస్తున్నారని సైటైర్లు వేశారు .దీనికి ఎమ్మెల్యే వెంకటవీరయ్య కూడా అదే స్థాయిలోసోమవారం కౌంటర్ ఇచ్చారు . ఏ పదవి లేకపోయినా గన్ మెన్ల రక్షణ , ద్వార పాలకుల కాపలా , మూడు నాలుగు చోట్ల ఇల్లు ,కేసీఆర్ ,కేటీఆర్ తో హెలికాఫ్టర్ల ప్రయాణాలు చేసిన నువ్వా దొరవు…? నేనా…? ఎక్కడ సొంత ఇల్లు లేదు …ప్రజల సేవ తప్ప మరో వ్యాపకం లేదు నాకు …నువ్వు బడా కాంట్రాక్టర్ వి ,భూస్వామివి , కోట్ల అధిపతివి ,ఎవరిని దొర అంటారో తేల్చుకుందాం రా…! అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వెంకటవీరయ్య సవాల్ విసిరారు …

నేను సత్తుపల్లిలో పోటీచేస్తా …కేసీఆర్ టికెట్ కన్ఫర్మ్ చేశారు .మరి నువ్వు ఎక్కడ పోటీచేస్తావో తెలియదు .. చెప్పే దమ్ము లేదు .దమ్ముంటే చెప్పు అని అన్నారు . మాటలు చెప్పడం కాదు ఆచరణలో పెట్టాలి …నీకు ఉన్న దల్లా డబ్బు అహంకారం తప్ప ఏమిలేదని పొంగులేటిని దెప్పిపొడిచారు . సత్తుపల్లిలో కాంగ్రెస్ పార్టీలోనే నాలుగు వర్గాలు ఉన్నాయి. నలుగురు క్యాంపు ఆఫీస్ లు పెట్టారు . పార్టీని ఐక్యం చేస్తానని , కేసీఆర్ ను గద్దె దింపుతానని పెద్ద పెద్ద మాటలు చెపుతున్న నువ్వు ముందు నీ పార్టీలో ఒక్క ఆఫీస్ పెట్టె దమ్ము ఉందా ?అని ప్రశ్నించారు . ఇల్లు చక్కదిద్దలేనోడు ఊరును చక్కదిద్దిన చందంగా పొంగులేటి వ్యవహారం ఉందని వెంకటవీరయ్య ఎద్దవా చేశారు …

Related posts

ఏపీ ప్రభుత్వానికి రూ.120 కోట్ల జరిమానా వడ్డించిన ఎన్జీటీ…

Drukpadam

ఈవినింగ్ 7లోపు డిన్నర్ చేస్తే.. లాభం ఏంటో తెలుసా..?

Ram Narayana

ఖమ్మం లో ఎం ఎల్ న్యూ డెమోక్రసీ ప్రదర్శన దృశ్యాలు

Drukpadam

Leave a Comment