న్యాయపోరాటంలో విజయుడుగా నిలిచిన వెంకట్రావు
తప్పుడు అఫిడవిట్ తో ఎమ్మెల్యే పదవి పోగొట్టుకున్న వనమా
రాజ్యాంగం ప్రకారం అతని ఎన్నిక చెల్లదన్న తెలంగాణ హైకోర్టు
వనమా అఫిడవిట్ పై అనేక అభియోగాలు …
ఆస్తుల వివరాల వెల్లడిలో తప్పుల తడక
తాను హిందువు అయినప్పటికీ క్రిస్టియన్ మైనార్టీ కోటాలో ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకున్నట్లు కోర్ట్ నిర్దారణ …
2018 ఎన్నికల్లో తప్పుడు ధ్రుపత్రాలతో ఎన్నికల్లో నామినేషన్ వేసి కొత్తగూడెం ఎమ్మెల్యేగా గెలిచిన వనమా వెంకటేశ్వరావు శాసనసభ్యత్వాన్ని రద్దుచేస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీచేయడం సంచలనంగా మారింది. వనమా ఎమ్మెల్యే పదవిని రద్దు చేయడమే కాకుండా ఆ ఎన్నికల్లో రెండవస్థానంలో నిలిచిన జలగం వెంకట్రావు ను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించాలని కోర్టు తన తీర్పులో స్పష్టంగా పేర్కొన్నది …2018 నాటి నుంచే జలగం వెంకట్రావు ఎమ్మెల్యే గా అర్హుడవుతాడని ఆ తీర్పులో పేర్కొనడం గమనార్హం …దీంతో ఇప్పుడు కొత్తగూడం ఎమ్మెల్యే గా జలగం వెంకట్రావు ప్రమాణ స్వీకారం చేస్తారా …? చేస్తే ఎప్పుడు చేస్తారు అనేది ఆసక్తిగా మారింది. మరి ఇప్పటివరకు ఎమ్మెల్యేగా అనేక అధికారాలను చెలాయించిన వనమా పై చర్యలు ఉంటాయా…? ఉంటె ఎలాంటి చర్యలు ఉంటాయి. అనే చర్చలు జరుగుతున్నాయి. వనమా శాసనసభ సభ్యత్వం రద్దు అయిందని తెలియగానే వనమా శిభిరం కంగు తినగా , జలగం శిభిరం ఆనందంతో కేరింతలు కొట్టింది. పలువురు జలగం వర్గీయలు స్వీట్లు పంచుకున్నారు . శాసనసభ గడువు మరో నాలుగు నెలలు మాత్రమే ఉంది . ఈలోపు జలగం ప్రమాణ స్వీకారం చేసి ఎమ్మెల్యేగా వస్తారా …?లేక వనమా హైకోర్టు తీర్పుపై సుప్రీం కు వెళ్లి స్టే తెచ్చుకుంటారా…? అనేది ఆసక్తికర అంశం …రానున్న ఎన్నికల్లో వనమా కు బీఆర్ యస్ తిరిగి సీటు ఇస్తుందా .,? లేదా అని సందేహాలు నెలకొన్న వేళ కోర్ట్ తీర్పు ఆశనిపాతంలా మారింది. కొత్తగూడం పై అధికార పార్టీ నుంచి పలువురు ఆశ పెట్టుకున్నారు . వారిలో జలగం కూడా ఒకరు . కోర్ట్ కేసు జలగం కు అనుకూలంగా తీర్పు వచ్చిన నేపథ్యంలో బీఆర్ యస్ టికెట్ జలగం కు ఇవ్వాల్సిన అనివార్యమైనా పరిస్థితి ఏర్పడింది. వనమా ప్రస్తుతం మాజీ అయ్యారు . రేపటినుంచి ప్రోటోకాల్ ప్రకారం ఆయన అధికార కార్యక్రమాల్లో పాల్గొనడం జరగదు . లెక్క ప్రకారం జలగం వెంకట్రావు ఎమ్మెల్యే హోదాలో పాల్గొనాల్సి ఉంటుంది.అయితే ఆయన ప్రమాణ స్వీకారం జరిగితే ఎమ్మెల్యేగా అన్ని హక్కులు పొందుతారు ..ప్రోటోకాల్ ఉంటుంది. కొత్తగూడెం లో ఏమి జరుగుతుంది అనేది చర్చనీయాంశంగా మారింది….