- తనపై అనర్హతను తిరిగి విచారించాలని హైకోర్టు లో వనమా పిటిషన్ …స్వీకరించిన న్యాయస్థానం
- తనపై అభియోగాల్లో వాస్తవం లేదన్న వనమా …
- కోర్ట్ తీర్పును పునః పరిశీలించాలని పిటిషన్
- మెజారిటీ ప్రజల అభిమానంతో గెలిచానని వనమా వెల్లడి
- కోర్ట్ తీర్పును గౌరవిస్తూనే కోర్టులో తన వాదనలు వినిపిస్తానన్న వనమా
- తనపై కోర్ట్ అనర్హత వేటు వేయడాన్ని సవాల్ చేస్తూ కొత్తగూడం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు తిరిగి హైకోర్టు ను బుధవారం ఆశ్రయించారు . వనమా పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. దానిపై మరికొద్ది సేపట్లో విచారణ జరుగుతుందని వనమా అనుయాయులు తెలిపారు . కచ్చితంగా తమకు అనుకూలంగా తీర్పు వస్తుందనే గట్టి విశ్వాసం తో వనమా ఉన్నారు. తనపై జలగం వెంకట్రావు మోపిన అభియోగాలపై న్యాయస్థానంలో తేల్చుకుంటానని ఆయన అన్నారు . అందువల్ల తనపై అనర్హత వేటును పునః పరిశీలించాలని హైకోర్టు ను కోరారు . సుప్రీం కు వెళ్లేందుకు సిద్దమైన వనమా మెజారిటీ ప్రజల ఓట్లతో గెలిచిన తన శాసనసభత్వాన్ని కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు .దీనిపై కోర్టు ఈ మధ్యాహ్నానికి తీర్పు వస్తుందని ఆశాభావంతో వనమా ఉన్నారు .బీఆర్ యస్ కూడా వనమాకు అండగా ఉన్నట్లు సమాచారం …
- కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు 2018 ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించి ,ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించి ఎన్నికైయ్యారని అందువల్ల అతని ఎన్నిక చెల్లదని ఆయనపై పోటీచేసి ఓడిపోయిన ప్రత్యర్థి జలగం వెంకట్రావు కోర్టుకు వెళ్లారు . దానిపై అనర్హత వేటు వేస్తూ కోర్ట్ తీర్పు ఇచ్చింది. దీనిపై వనమా న్యాయపోరాటానికి వెళ్లారు
- తాను ప్రజాస్వామ్య బద్ధంగానే కొత్తగూడెం ఎమ్మెల్యేగా గెలుపొందానని, ప్రజాబలం ఉండడం వల్లే విజయం సాధించానని కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. తన ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తానని స్పష్టం చేశారు. 45 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో అనేక గెలుపోటములు చవి చూసినట్టు చెప్పారు. న్యాయస్థానాలపై తనకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు. తాను తుది వరకు ప్రజాక్షేత్రంలోనే ఉంటానని, అక్కడే తేల్చుకుంటానని తేల్చి చెప్పారు. తనకు బీఆర్ఎస్ అధిష్ఠానం అండదండలు ఉన్నాయన్నారు.
- 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించిన వనమా ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరారు. ఆ ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు వివరాలు ఇచ్చారంటూ ఆ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం నిన్న తీర్పు వెలువరించింది. వనమా ఎన్నిక చెల్లదని పేర్కొంటూ, ఆ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటించింది. అంతేకాకుండా అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు రూ. 5 లక్షల జరిమానా విధించినా సంగతి విధితమే..
.