వనమా పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు …స్టేకు నిరాకరణ…
సుప్రీం కు వెళ్లే వరకు స్టే ఇవ్వాలని కోరిన వనమా… నో అన్న కోర్టు
రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే వనమా పై అనర్హత వేటు
ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని అభియోగాలు
వనమా తప్పుడు సమాచారంపై కోర్టుకు వెళ్లిన టీఆర్ యస్ అభ్యర్థి జలగం వెంకట్రావు ..
జలగం వెంకట్రావు ఇచ్చిన మెటీరియల్ ఎవిడెన్స్ విచారించిన హైకోర్టు
వనమా అఫిడివిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని నిర్దారణ
రెండవస్థానంలో ఉన్న జలగంను ఎమ్మెల్యేగా గుర్తించాలని కోరిన కోర్ట్
తనను కొత్తగూడెం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించాలని కోరిన జలగం …
తనపై అనర్హతను కొట్టివేయాలని, సుప్రీం కోర్ట్ కు వెళ్లెవరకూ తనకు స్టే ఇవ్వాలని వనమా వెంకటేశ్వరావు హైకోర్టు లో వేసిన పిటిషన్ ను కోర్ట్ కొట్టి వేసింది. స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో వనమా కు నిరాశ ఎదురైంది .ఇప్పటికే జలగం వెంకట్రావు తనను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించాలని కోర్టు శాసనసభ స్పీకర్ ను అప్రోచ్ అయ్యారు . ఆయన సూచన మేరకు బుధవారం అసెంబ్లీ లో సెక్రటరీ ని కలిసి హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కాపీని అందజేశారు . తర్వాత రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిసి కోర్టుకి ఇచ్చిన జడ్జి మెంట్ కాపీని అందించారు . దీనిపై వారు పరిశీలిన జరిపి జలగం కబురు చేస్తామని అన్నారు . దీనిపై అధికారులు న్యాయసలహా కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం .అదే సందర్భంలో వనమా హైకోర్టు ను ఆశ్రయించడంతో కోర్ట్ నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తాయనే ఆసక్తి నెలకొన్నది .బుధవారం వనమా పిటిషన్ స్వీకరించి విచారణ జరిపిన హైకోర్టు తీర్పును నిన్న రిజర్వ్ చేసింది. గురువారం తీర్పు ను వెలువరిస్తూ వనమా పిటిషన్ కొట్టి వేస్తున్నట్లు తీర్పు వెలువరించింది . సుప్రీం కోర్ట్ కు వెళుతున్నందున అప్పటివరకు స్టే ఇవ్వలని వనమా కోరారు అందుకు కోర్ట్ నిరాకరించింది. దీంతో జలగం ప్రమాణస్వీకారానికి లైన్ క్లియర్ అయినట్లు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఎన్నిక కమిషన్ , అసెంబ్లీ స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు …ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావు ను నిర్ణయిస్తూ కోర్ట్ ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా గెజిట్ లో పేరు మార్పు చేస్తారా …? స్పీకర్ కోర్ట్ డైరక్షన్ ప్రకారం వెంకట్రావు ను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయిస్తారా లేదా …అనేది ఆసక్తిగా మారింది… 2018 నుంచే జలగం వెంకట్రావు ను ఎమ్మెల్యేగా గుర్తించాలని హైకోర్టు స్పష్టం చేసింది.అంతే కాకుండా వనమా కు తప్పుడు సమాచారం ఇచ్చారని 5 లక్షల జరిమానా కూడా ఇడించింది.ఇంతవరకు ఇలాంటి తీర్పు వెలవడలేదని న్యాయవర్గాలు సైతం అంటున్నాయి…తప్పుడు సమాచారం ఇచ్చే వారికీ ఇదొక చెంప పెట్టులాంటిదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి…
High Court dismisses Vanama’s petition…denial of stake…
Vanama asked for a stay until he went to the Supreme Court… the court said no
Two days ago MLA Vanama was disqualified
Charges of giving false information in election affidavit
TRS candidate Jalagam Venkatarao went to court on Vanama’s false information.
The High Court heard the material evidence given by Jalagam Venkatarao
Confirmation that Vanama gave false information in the affidavit
The court sought to recognize Jalagam, who was in second place, as an MLA
Jalagam asked him to take oath as Kothagudem MLA…
The court rejected the petition filed by Vanama Venkateswara Rao in the High Court to dismiss his disqualification and stay him till he goes to the Supreme Court. Refused to stay. Vanama was disappointed by this.Jalagam Venkatarao has already approached the Speaker of the Court Legislative Assembly to make him take oath as an MLA. According to his suggestion, he handed over the copy of the judgment given by the High Court along with the Secretary in the Assembly on Wednesday. Later, along with the state election officer, they provided a copy of the judgment given to the court. They said that they will look into it and talk about it. It is reported that the authorities are waiting for legal advice on this matter. In the same case, Vanama approached the High Court and there is interest to see what kind of orders will come from the court. Pronouncing the verdict on Thursday, Vanama’s petition was dismissed. Vanama asked for a stay until then as he was going to the Supreme Court, but the court refused. With this, opinions are being expressed that the line has been cleared for Jalagam’s oath taking. But what steps will be taken by the Election Commission and the Speaker of the Assembly…will they change the name in the gazette in accordance with the judgment of the court deciding Jalagam Venkatarao as MLA…? As per the direction of the Speaker’s Court, Venkatarao will be sworn in as an MLA or not… The High Court has made it clear that Jalagam Venkatarao should be recognized as an MLA from 2018. Apart from that, Vanama has also been fined 5 lakhs for giving false information. Even the judiciary says that no such verdict has been issued so far… False information. Opinions are being expressed that this is like a slap to the giver…