Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

అటు గోదావరి …ఇటు మున్నేరు మంత్రి పువ్వాడ ఉరుకులు పరుగులు …

అటు గోదావరి …ఇటు మున్నేరు మంత్రి పువ్వాడ ఉరుకులు పరుగులు …
వరద భాదితులకు అండగా అధికార యంత్రాంగంతో మంత్రి పువ్వాడ
అధైర్య పడకండి.. మేమున్నాం.. అభయం ..
భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్నా… ప్రాణ నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్న మంత్రి పువ్వాడ.
అత్యవసరం అయితే తప్పా ఇండ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి.
మున్నేరు వరద ఉదృతిని పర్యవేక్షించి, ముంపుకు గురైన బాధితులను కలిసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
..

కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో పరిస్థితులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్వయంగా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అధికారులకు పలు ఆదేశాలు ఇస్తున్నారు. అటు గోదావరి వరదలను ,ఇటు ఖమ్మం మున్నేరు ఉధృతికి ఖమ్మం నగరంలో మునిగిన కాలనీ లలో స్వయంగా మంత్రి పర్యటన చేశారు . మున్నేరు వరద ను పరిశీలించారు …ఒకరకంగా చెప్పాలంటే ఆయన ఉరుకులు పరుగులతో అధికారులను సైతం పరుగులు పెట్టించారు …

ఖమ్మం నగరంలోని కాల్వొడ్డు, పద్మావతి నగర్, బొక్కలగడ్డ, మంచికంటి నగర్ ప్రాంతాల్లో నివాసంలోకి వరద నీరు చేరడంతో లోతట్టు ప్రాంతాల నిర్వాసితులకు ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించారు.

ఈ మేరకు వరదలో తిరుగుతూ ఇంకా పునరావాస కేంద్రాలకు వెళ్లని వాళ్ళను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని మంత్రి సూచించారు.

వరద నీటిలో ఇంటింటికీ వెళ్లి బాధితులను కలిసి ధైర్యం చెప్పారు. ఇళ్లలో ఉండొద్దు అని, వరద పెరిగే ప్రమాదాలు లేకపోలేదని అధికారులకు సహకరించాలని సూచించారు.

గతంలో ఎన్నడూ ఇంతటి వర్షాలు చూడలేదని స్థానిక ప్రజలు మంత్రి పువ్వాడతో మాట్లాడారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు ఒక పక్క, వివిధ ప్రాజెక్ట్స్ గేట్స్ ఎట్టివేయడం మారో పక్క.. తద్వారా గోదావరికి వరద పోటెత్తిందని మంత్రి పువ్వాడ వారికి చెప్పారు.

ఎవ్వరూ అధైర్యపడొద్దని ప్రభుత్వం అన్ని విధాలుగా మిమ్మల్ని ఆదుకుంటుందని, నయా బజార్ పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్ళాలని సూచించారు.

రెవెన్యూ, పోలీస్, ఎలక్ట్రిసిటీ, పంచాయితీ రాజ్, ఇరిగేషన్, ఆర్ అండ్ బి, హెల్త్ పలు ప్రభుత్వ శాఖలు అధికారులను, క్షేత్ర స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలుతో మాట్లాడుతూ మేమున్నాం అంటూ వారిలో ధైర్యం నింపారు.

అత్యవసరం అయితే తప్పా ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావొద్దని మంత్రి పువ్వాడ విజ్ఞప్తి చేశారు. అకారణంగా ప్రజలను ఎవరిని బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను, ఇరిగేషన్ అధికారులందరు ముంపు ప్రాంతాల్లోనే ఉండి పరిస్థితులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులని ఆదేశించారు.

మంత్రి పువ్వాడ వెంట కలెక్టర్ VP గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్ కుమార్, తహశీల్దార్ శైలజ అధికారులు ఉన్నారు.

భద్రాచలం వద్ద గోదావరి వరద ఉదృతిని పర్వేక్షించి …అధికారులతో సమీక్షా
ప్రతినిత్యం అప్రమత్తంగా ఉండాలన్న మంత్రి
అత్యవసరం అయితే తప్పా ఇండ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి.
వరదలు పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలి

.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా భద్రాచలంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో పరిస్థితులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు స్వయంగా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అధికారులకు పలు ఆదేశాలు ఇస్తున్నారు.

ప్రకృతి వైపరిత్యాలు అడ్డుకోలేం కానీ నష్టాన్ని నివారించగలం అంటూ జిల్లా వ్యాప్తంగా క్షేత్ర స్థాయి అధికారులను ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ ప్రాణనష్టం జరగకుండా పరిస్థితులు చక్కదిద్దాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక ను ఆదేశించారు.

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు ఒక పక్క, వివిధ ప్రాజెక్ట్స్ గేట్స్ ఎట్టివేయడం మారో పక్క.. తద్వారా గోదావరికి వరద పోటెత్తిందని మంత్రి పువ్వాడ అన్నారు.

రెవెన్యూ, పోలీస్, ఎలక్ట్రిసిటీ, పంచాయితీ రాజ్, ఇరిగేషన్, ఆర్ అండ్ బి, హెల్త్ పలు ప్రభుత్వ శాఖలు అధికారులను, క్షేత్ర స్థాయిలో సిబ్బంది నిత్యం అప్రమత్తం ఉండాలని సూచించారు.

అత్యవసరం అయితే తప్పా ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావొద్దని మంత్రి పువ్వాడ విజ్ఞప్తి చేశారు. మత్స్యకారులు, జాలర్లు ఎవరూ చేపల వేటకు వెళ్ళొద్దని కోరారు. అకారణంగా ప్రజలను ఎవరిని బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ వినీత్ ను ఆదేశించారు.

జిల్లా వ్యాప్తంగా పోలీస్, ఇరిగేషన్ అధికారులందరు ముంపు ప్రాంతాల్లోనే ఉండి పరిస్థితులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

భద్రాచలంలో ప్రస్తుతం కొనసాగుతున్న పునరావాస కేంద్రాలను మెరుగు పరచి మరికొన్ని పునరావాస కేంద్రాలు సిద్దం చేయాలని కలెక్టర్ కు సూచించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్దంగా ఉండాలన్నారు.

జిల్లాలో ఎక్కడ కూడా ప్రాణ నష్టం అస్తి నష్టం జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని, అందుకు అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు .

అధికారులతో సమీక్షా ….

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు కారణంగా జిల్లాలోని వాగులు, వంకలు, చెరువులు మరియు గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తున్న తరుణంలో అధికార యంత్రాంగం వరదలు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. గోదావరి వరదల సందర్భంగా భద్రాచలం వద్ద గోదావరి బ్రిడ్జి, చెరువు కట్ట పై నుండి వరద ఉదృతిని మంత్రి పువ్వాడ పర్యవేక్షించారు.

అనంతరం ఐటీసీ గెస్ట్ హౌస్ నందు జిల్లా కలెక్టర్ ప్రియాంక అల, జిల్లా ఎస్పీ వినీత్, వరదల ప్రత్యేక అధికారి అనుదీప్, ITDA PO ప్రతీక్ జైన్, ASP పారితోష్ పంకజ్, లైబ్రరీ చైర్మన్ దిండిగల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ లతో సమీక్ష నిర్వహించారు.

రానున్న 48 గంటల వరకు ఇదే పరిస్థితి కొనసాగనున్న నేపథ్యంలో అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరు తమకు కేటాయించిన విధుల్లో ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు.

జిల్లాలో అనేక ప్రాంతాలలో రహదారులపై, లో-లెవెల్ బ్రిడ్జి లపై వరద నీరు ప్రవహిస్తూ ప్రమాదకరంగా మారాయని, కావున ప్రమాద పరిస్థితులను ప్రజలకు వివరించి అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

పాల్వంచ-భద్రాచలం నాగారం కిన్నెరసాని బ్రిడ్జి వద్ద వరద ఉధృతిని అక్కడ నిత్యం పోలీస్ సిబ్బందికి నియమించి, మెడికల్ ఎమర్జెన్సీ అయితే తప్ప రాకపోకలు నియంత్రించాలని జిల్లా ఎస్పి వినీత్ కు సూచించారు.

ప్రజలు ప్రభుత్వంకు సహకరించాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని విజ్ఞప్తి చేశారు. మరో 48 గంటల పాటు అధికారుల సూచనలను పాటిస్తూ సహకరించాలని కోరారు.

ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించిన నీట మునిగిన లోతట్టు ప్రాంతాల ప్రజలకు పునరావాస కేంద్రాల్లో మంచి వసతులు, సౌకర్యాలు కల్పించాలని, వారికి అవసరం అయ్యే అన్ని సమకూర్చాలని కోరారు.

ముందస్తు చర్యల్లో భాగంగా అదనపు పునరావాస కేంద్రాలు సిద్ధంగా ఉంచాలని, ముంపునకు గురయ్యే ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. పునరావాస కేంద్రాల్లో వైద్య సేవలు అందించేందుకు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, అలాగే నిరంతర పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరాయంగా చేపట్టాలని సూచించారు.

జిల్లా పోలీసు యంత్రాంగం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆపదలో ఉన్న వారికి సేవలందించాలని పేర్కొన్నారు.

అత్యవసర సేవలకు తప్పనిసరిగా NDRF బృందాల సేవలను వినియోగించుకోవాలని, జిల్లాలోని పరిశ్రమల ఆధ్వర్యంలో ఉన్న రెస్క్యూ టీములను అందుబాటులో ఉంచాలని చెప్పారు.

ఎక్కడ కూడా ప్రాణ నష్టం, అస్తి నష్టం వాటిల్లకుండా ఎప్పటికప్పుడు అధికారులు సమన్వయం చేసుకుంటూ ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు.

ఖమ్మం నగరంలో రంగంలోకి NDRF బృందం..

▪️NDRF తో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్న మంత్రి పువ్వాడ..

▪️పలువురిని గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలింపు..

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ ఆదేశాల మేరకు NDRF బృందం రంగంలోకి దిగింది.

ఖమ్మం నగరంలో వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు NDRF సిబ్బంది తో కలిసి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

గంట గంటకు పెరుగుతున్న గోదావరి ఉదృతి ని మంత్రి పువ్వాడ జిల్లా కలెక్టర్ VP గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్ తో కలిసి అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు.

ఇప్పటికే పలు ప్రాంతాల్లో వరదలో తిరుగుతూ ప్రజలను అప్రమత్తం చేయగా పలు ప్రాంతాల్లో NDRF సిబ్బందితో బోట్ లో ఇంటింటికీ వెళ్ళి క్షుణ్ణంగా వెతుకుతూ మైక్ ద్వారా వరదలో మునిగిన ఇంటి ముందు పిలుస్తూ.. ఇంకా ఇళ్ళల్లో చిక్కుకున్న వారికి రక్షించారు.

NDRF కమాండర్, ఇన్స్పెక్టర్ ప్రవీణ్ నేతృత్వంలో విశాఖపట్నం నుండి వచ్చిన ప్రత్యేక బృందం లోతట్టు ప్రాంతాలైన పద్మావతి నగర్, గుర్రం ఫంక్షన్ హాల్ ప్రాంతం, మంచికంటి నగర్, బొక్కలగడ్డ ప్రాంతాల్లో NDRF బృందం విస్తృతంగా పర్యటించి ఇళ్లలో, మెడ పైన మిగిలి ఉన్న బాధితులను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Related posts

మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలిస్తాం: కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరిన కాంగ్రెస్ నేతలు

Ram Narayana

కొత్త రేషన్ కార్డుల జారీకి ఇంకా విధివిధానాలు ఖరారు కాలేదు: మంత్రి శ్రీధర్ బాబు

Ram Narayana

తెలంగాణాలో యమ తాగేస్తున్నారు …!

Ram Narayana

Leave a Comment