- ఈ నెల 29న అమిత్ షా తెలంగాణ షెడ్యూల్
- భారీ వర్షాల కారణంగా రాష్ట్ర పర్యటన వాయిదా పడినట్లు వెల్లడి
- అమిత్ షా పర్యటన మళ్లీ ఎప్పుడు ఉంటుందో త్వరలో వెల్లడి
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా పడింది. భారీ వర్షాల కారణంగా ఆయన రాష్ట్ర పర్యటనను వాయిదా వేసినట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి. తిరిగి ఆయన పర్యటన ఎప్పుడు ఉంటుందో పార్టీ త్వరలో వెల్లడించే అవకాశముంది. ఇంతకుముందు ప్రకటించిన దాని ప్రకారం, ఈ నెల 29న అమిత్ షా తెలంగాణకు రావాల్సి ఉంది. ఉదయం ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చి, పార్టీ కోర్ కమిటీ భేటీలో పాల్గొని, ఆ తర్వాత జిల్లాల అధ్యక్షులతో సమావేశం కావాల్సి ఉంది. ఎన్నికల నిర్వహణ కమిటీ, మేనిఫెస్టో కమిటీ, పార్టీలో చేరికలు, ఎన్నికల్లో గెలుపు కోసం ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై రాష్ట్ర నేతలతో చర్చిస్తారని తొలుత భావించారు. అయితే రాష్ట్రంలో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆయన పర్యటన వాయిదా పడింది.