Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

కన్నీటి పర్వవంతమైన తమైన మోరంచపల్లి …

కన్నీటి పర్వవంతమైన తమైన మోరంచపల్లి …
మొత్తం 1200 గ్రామా జనాభా తెల్లవార్లూ నీటిలోనే
నీటిలో ఇరుక్కున్న 12 లారీలు
తమను ఆదుకోండని వేడుకోలు
గ్రామంలో ఉన్న పశువుల్లో 250 నుంచి మూడువందల పశవుల మృతి
ఎక్కడ చుసిన కళేబరాలు …వాటిని పూడ్చటానికి ఇబ్బందులు ,కాల్చాలంటే కట్టెలు లేని పరిస్థితి
మరుసటి రోజు చేరుకున్న ఎమ్మెల్యే కలెక్టర్ ,ఎస్పీ

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్ష బీభత్సం కొనసాగుతుంది. ముఖ్యంగా తెలంగాణ జిల్లాలలోని పలు జిల్లాలలో అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల్ వద్ద నిన్న ఉదయం నుంచీ ఈ ఉదయం 7 గంటల వరకు అత్యధికంగా 616.5 మిల్లీ మీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది.

దీంతో భూపాలపల్లి జిల్లాలో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. మొగుళ్లపల్లి మండలం మోరంచపల్లి అనే చిన్న గ్రామం అష్టదిగ్బంధంలో చిక్కుకుంది. భూపాలపల్లి జిల్లాలో మోరంచ వాగు ఉగ్రరూపం దాల్చింది. మోరంచ వాగు ఉధృతంగా ప్రవహించడంతో మోరంచపల్లి గ్రామం పూర్తిగా నీట మునిగింది. భూపాలపల్లి-పరకాల ప్రధాన రహదారి పై మోరంచపల్లి వద్ద సుమారు 15 ఫీట్ల ఎత్తులో మోరంచ వాగు పొంగి ప్రవహిస్తోంది.

దీనితో జాతీయ రహదారి పై వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎగువన గణప సముద్రం 3 ఫీట్లు మేర మత్తడి పడుతుండం, ఆ నీరు కూడా మోరంచ వాగులో చేరటంతో ప్రవాహం ఉధృతి మరింత పెరిగింది. దీంతో వరద ముంపుకు గురై మోరంచపల్లి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. అయితే బుధవారం రాత్రి నుండి ఇళ్లలోకి నీరు చేరుతుండటంతో గ్రామస్థులు భయాందోళనలో ఉన్నారు.

బస్ స్టాండ్ ఆవరణలో ఉన్న ఓ బిల్డింగ్ పైకి ఎక్కి వర్షంలో భయం గుప్పిట్లో గడుపుతున్నారు. చుట్టూ ఎటు వెళ్లలేని పరిస్థితిలో జల దిగ్బంధంలో చిక్కుకున్నారు మోరంచపల్లి వాసులు. వారు సహాయం కోసంఅర్దించారు .
జిల్లా అధికారులకేకాకుండా తెలిసినవారికి చివరకు మీడియా వారికీ సైతం తమ భాదలు తెలిపే ప్రయత్నం చేశారు .గ్రామస్తులను కాపాడటానికి అధికారులు వెళ్లాలంటే కూడా ఇబ్బందికర పరిస్థితి ఉంది. భూపాలపల్లి నుండి అధికారులు రావడానికి ఏమాత్రం అవకాశం లేదు. అష్టదిగ్బంధనంలో గ్రామం ఉంది .విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్ గ్రామస్తులను రక్షించేందుకు ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలతో పటు రెండు హెకాఫ్టర్లను సైతం పంపించారు . జిల్లా కలక్టర్ , ఎస్పీలకు ప్రజలను రక్షణించాలని ఆదేశాలు జారిచేశారు .

దీనితో 353సీ జాతీయ రహదారి పై వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎగువన గణప సముద్రం 3 ఫీట్లు మేర మత్తడి పడుతుండం, ఆ నీరు కూడా మోరంచ వాగులో చేరటంతో ప్రవాహం ఉధృతి మరింత పెరిగింది. దీంతో వరద ముంపుకు గురై మోరంచపల్లి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. అయితే బుధవారం రాత్రి నుండి ఇళ్లలోకి నీరు చేరుతుండటంతో గ్రామస్థులు భయాందోళనలో ఉన్నారు.

బస్ స్టాండ్ ఆవరణలో ఉన్న ఓ బిల్డింగ్ పైకి ఎక్కి వర్షంలో భయం గుప్పిట్లో గడుపుతున్నారు. చుట్టూ ఎటు వెళ్లలేని పరిస్థితిలో జల దిగ్బంధంలో చిక్కుకున్నారు మోరంచపల్లి వాసులు. వారు సహాయం కోసం అర్ధిస్తున్నారు. మోరంచ పల్లి వాసులను కాపాడటానికి అధికారులు వెళ్లాలంటే కూడా ఇబ్బందికర పరిస్థితి ఉంది. భూపాలపల్లి నుండి అధికారులు రావడానికి ఏమాత్రం అవకాశం లేదు.

Related posts

భట్టి పీపుల్స్ మార్చ్ ఖమ్మం నగరంలోకి గ్రాండ్ ఎంట్రీ …ప్రజల బ్రహ్మరథం…

Drukpadam

ఇది ప్రజాపాలనంటే..ప్రపంచంతో పోటీపడలనే లక్ష్యంతో ముందుకు..డిప్యూటీ సీఎం భట్టి !

Ram Narayana

ఈ నిధులను రుణమాఫీకే వినియోగించాలి.. : భట్టివిక్రమార్క

Ram Narayana

Leave a Comment