మణిపూర్ నిందితులను కఠినంగా శిక్షించాలి
మణిపూర్ లో అల్లర్లను అరికట్టడం లో బీజేపీ విఫలం.
- సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
మణిపూర్ అల్లర్లు ను అరికట్టడం లో బిజెపి ప్రభుత్వం విఫలం చెందిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా కేంద్రం సుందరయ్య భవన్ లో పాలేరు అసెంబ్లీ సమావేశం ఈ జరిగింది. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లడుతూ, మణిపూర్ ఘటన దేశాన్ని కలిచి వేసినా, కనీసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మౌనంగా ఉండడం, మహిళల పట్ల బిజెపి. ప్రభుత్వ వైఖరి అర్ధమవుతుందని, బిజెపి పాలిత ప్రాంతమైన మణిపూర్ లో మహిళలకు రక్షణ లేదని నేడు జరిగిన సంఘటనతో అర్ధమవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. . బిజెపి పాలిత రాష్ట్రాలలో మహిళల పట్ల దాదులు, అత్యాచారాలు, హత్యలు అత్యధికం అవుతున్నా, కనీసం రక్షణ కల్పించలేని కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉండడం దురదృష్టకరమని, రానున్న కాలంలో మహిళల భద్రత పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి నిర్లక్ష్యంగా ఉండబోతోందని అర్థమవుతుందని వారు తెలిపారు. వెంటనే మణిపూర్ ను రక్షించాలని, మహిళలను నగ్నంగా ఊరేగించిన వారిని వెంటనే కఠినంగా శిక్షించి మణిపూర్ అల్లర్లపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జాతీయ కమిటీ సభ్యులు బి. వెంకట్, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, పాలేరు అసెంబ్లీ ఇంచార్జ్ బండి రమేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బుగ్గవిటి సరళ, యర్రా శ్రీకాంత్, వై విక్రమ్, జిల్లా కమిటి సభ్యులు గుడవర్తి నాగేశ్వరరావు, సుదర్శన్ రెడ్డి, మండల కమిటి కార్యదరుషులు నoడ్ర ప్రసాద్, కొమ్ము శ్రీను, వెంకట్రాం రెడ్డి, సోషల్ మీడియా ఇంచార్జ్ ఎస్. నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.