Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలురాజకీయ వార్తలు

రామసహాయం మాధవి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

రామసహాయం మాధవి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

పొంగులేటి మాధవరెడ్డిని కలవగా పాలేరు కాంగ్రెస్ కార్యకర్తలో నూతన ఉత్సాహం

తిరుమలాయపాలెం కూసుమంచి 29 న్యూస్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ రెండో తారీఖున ప్రజా జన గర్జన సభలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మొట్టమొదటిగా పాలేరు నియోజకవర్గం లోని కాంగ్రెస్ రాష్ట్ర నాయకురాలు రామ సహాయం మాధవిరెడ్డిని పాలేరు గ్రామంలోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కల్వగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మాధవిరెడ్డి సాధవరంగా సాల్వ కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె బాగోగులను అడిగి తెలుసుకున్నారు. హాజరైన కార్యకర్తల ను ప్రేమతో పలకరించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లక్ష్యంగా ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా కృషి చేయాలని కోరారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాధవిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసినందున పాలేరు వివిధ రాజకీయ పార్టీ నాయకుల్లో చర్చగా మారింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు కొరివి వెంకటరత్నం మువ్వ విజయబాబు మద్దినేని స్వర్ణ కుమారి చావా శివరామకృష్ణ రామ్ రెడ్డి చరణ్ రెడ్డి ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు నీరుడు లాజరస్ మండల నాయకులు వల్లోజ్ తిరుమలేష్ ఆలేటి రాంబాబు బండారుపల్లి శ్రీను ఎల్లవుల రవి గుగులోతు వీరన్న తాళ్లపల్లి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు

Related posts

నా పాలనలో మీకు న్యాయం జరిగిందని నమ్మితే నాకు అండగా నిలవండి..వైఎస్ జగన్

Drukpadam

పాకిస్థాన్​ తో చర్చలా.. అది అసలు జరగని పని.. : అమిత్​ షా

Drukpadam

ఏపీలో పరిస్థితులు దిగజారిపోయాయి…చర్యలు తీసుకోండి రాష్ట్రపతి ,ప్రధానికి చంద్రబాబు లేఖ …

Ram Narayana

Leave a Comment