- వచ్చే ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలు
- రిపబ్లికన్ల మధ్య పెరుగుతున్న పోటీ
- బరిలో ఇప్పటికే నిక్కీహేలీ, వివేక్ రామస్వామి
- తాజాగా రేసులోకి హర్షవర్ధన్ సింగ్
వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి మరో ఇండియన్ అమెరికన్ దూసుకొచ్చారు. ఇప్పటికే నిక్కీ హేలీ (51), వివేక్ రామస్వామి (37) బరిలో ఉండగా తాజాగా హర్షవర్ధన్‌సింగ్ వచ్చి చేరారు. ఆయన తన అభ్యర్థిత్వాన్ని ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ వద్ద నమోదు చేసుకున్నారు.
వీరు ముగ్గురూ రిపబ్లికన్ పార్టీ నుంచే బరిలోకి దిగుతుండడం ఆసక్తిని రేకిత్తిస్తోంది. మరోవైపు, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు ఇది వరకే ప్రకటించారు. అంటే రిపబ్లిక్ పార్టీ నుంచి మొత్తం నలుగురు బరిలో ఉన్నట్టు లెక్క. పార్టీలో ఇంతమంది పోటీలో ఉన్నప్పటికీ అభ్యర్థిగా ఎవరు బరిలోకి దిగాలన్న విషయాన్ని రిపబ్లికన్ల జాతీయ సదస్సు నిర్ణయిస్తుంది.