Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయంప్రమాదాలు ...

కెనడాలోని పియర్సన్ ఎయిర్ పోర్టులో తిరబడ్డ విమానం ప్రయాణికులకు గాయాలు …

ల్యాండ్ అవుతూ తిరగబడిన విమానం.. తీవ్రంగా గాయపడిన ప్రయాణికులు.. !

  • కెనడాలోని టొరొంటో పియర్స్ విమానాశ్రయంలో ఘటన
  • క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమం
  • బలమైన గాలులే ప్రమాదానికి కారణమని అనుమానం

విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో తిరగబడటంతో 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో విమానంలో 80 మంది ప్రయాణికులున్నారు. డెల్టా ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం కెనడాలోని టొరొంటో పియర్సన్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బలమైన గాలులే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. 

గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిలో ఒక చిన్నారి కూడా వుంది. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. విమానం మిన్నియాపొలిస్ నుంచి వస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రమాదం నుంచి చాలామంది ఎలాంటి గాయాలు లేకుండా బయటపడినట్టు పేర్కొన్నారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. తిరగబడిన విమానం నుంచి ప్రయాణికులను రక్షిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts

ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై పిడుగులు!

Ram Narayana

ఇజ్రాయెల్ పౌరులపై నిషేధం విధించనున్న మాల్దీవులు…

Ram Narayana

శ్రీలంక కొత్త ప్రధానిగా హరిణి అమరసూర్య ప్రమాణం!

Ram Narayana

Leave a Comment