Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

జ్ఞానవాపిపై యోగి ఆదిత్యనాథ్‌కు అసదుద్దీన్ కౌంటర్

  • ముఖ్యమంత్రి పదవిలో ఉండి యోగి చట్టన్ని ఉల్లంఘిస్తున్నారని ఆగ్రహం
  • బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నారని ఆరోపణ
  • జ్ఞానవాపి మసీదు 400 ఏళ్లనుండి ఉందని వ్యాఖ్య

జ్ఞానవాపిపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలకు హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సోమవారం కౌంటర్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి పదవిలో ఉండి యోగి చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని ధ్వజమెత్తారు. ఆయన బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నారని ఆరోపించారు. అక్కడ 400 ఏళ్ల నుండి మసీదు ఉందన్నారు. 

అంతకుముందు యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ… జ్ఞానవాపిలో దేవుడి ప్రతిమలు ఉన్నాయని, చారిత్రక తప్పిదం జరిగిందని ముస్లిం పెద్దలు ఒప్పుకొని, దీనిని తిరిగి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాఖ్యలపై అసదుద్దీన్ స్పందించారు.

ఢిల్లీ ఆర్డినెన్స్‌పై అసదుద్దీన్ వ్యాఖ్యలు


ఢిల్లీ ఆర్డినెన్స్‌పై కూడా అసదుద్దీన్ స్పందించారు. దీనిని ఈ వారంలో పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశముంది. ఈ నేపథ్యంలో అసద్ లోక్ సభ జనరల్ సెక్రటరీకి నోటీసును పంపించారు. రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణంలో భాగమైన ఫెడరిలజం స్ఫూర్తిని ఉల్లంఘించేలా ఢిల్లీ ఆర్డినెన్స్ తీసుకు వస్తున్నారని మజ్లిస్ అధినేత పేర్కొన్నారు. తాను ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును తీసుకు రావడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆ నోటీసులో పేర్కొన్నారు.

Related posts

ప్రొఫెసర్ లైంగిక వేధింపులపై ప్రధానికి 500 మంది అమ్మాయిల లేఖ

Ram Narayana

పంటపొలాల్లో రూ 2 . 5 లక్షల విలువైన టమాటాలు దొంగతనం…

Drukpadam

ఢిల్లీ జేఎన్‌యూ స్టూడెంట్ ప్రెసిడెంట్‌గా దళిత విద్యార్థి ధనంజయ్

Ram Narayana

Leave a Comment