Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

సీఎం కేసీఆర్ గారు జర్నలిస్టుల గోడు వినండి …! టీయూడబ్ల్యూజే (ఐజేయూ ) రాష్ట్ర ఉపాధ్యక్షులు రాంనారాయణ…

కేసీఆర్ సారు … జర్నలిస్టులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి.
హెల్త్ కార్డులు, నివాస స్థలాల పంపిణీకి చర్యలు తీసుకోండి
జిల్లా వ్యాప్తంగా ఐజెయు పోస్టుకార్డు ఉద్యమం విజయవంతం
రాష్ట్ర వ్యాపిత ఉద్యమానికి అనూహ్యస్పందన….
మండల కేంద్రాలకు తాకిన పోస్టు కార్డు ఉద్యమం …

తెలంగాణ ఉద్యమకారునిగా, రాష్ట్ర సాధకుడిగా తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసిఆర్ జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చే దిశగా చర్యలు చేపట్టాలని టియుడబ్ల్యూజె (ఐజెయు) రాష్ట్ర ఉపాధ్యక్షలు కె. రాంనారాయణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా హెల్త్ కార్డులు లేక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చిన ఫలితం లేకపోయిందన్నారు. ఇది జర్నలిస్టులు న్యాయబద్దమైన , ధర్మబద్ధమైన డిమాండ్ అని అన్నారు … రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం ఖమ్మంలో టియుడబ్ల్యూజె (ఐజెయు) చేపట్టిన పోస్టుకార్డు ఉద్యమాన్ని ఆయన ప్రారంభించారు. హెల్త్ కార్డులు, జర్నలిస్టులకు నివాస స్థలాలు పంపిణీ జరిగేవిధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి స్వయంగా పోస్టుకార్డులు రాసే కార్యక్రమాన్ని ఐజేయు తీసుకున్న విషయం విధితమే. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన రాంనారాయణ మాట్లాడుతూ పేరుకే హెల్త్ కార్డులు ఉన్నాయని అవి ఎక్కడ ఏ ఆసుపత్రిలోనూ చెల్లుబాటు కావడం లేదన్నారు. కొంత మందికి అసలు హెల్త్ కార్డులు జారీ కాలేదన్నారు. చూసుకోవడానికి తప్ప ఆపదలో ఆదుకునే పరిస్థితిలో హెల్త్ కార్డులు లేవని ఆయన స్పష్టంచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అనారోగ్యాల బారిన పడి పలువురు ప్రాణాలు కోల్పోయారని రాంనారాయణ తెలిపారు. తక్షణం హెల్త్ కార్డులు అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో చెల్లుబాటయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఖమ్మంలో జర్నలిస్టుల నివాస స్థలాల సమస్యకు పరిష్కారం చూపిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు టియుడబ్ల్యూజె (ఐజెయు) కృతజ్ఞతలు తెలుపుతుందన్నారు. ఆయన కృషి ప్రశంసనీయమని రాంనారాయణ అన్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాలలో, నియోజక వర్గ కేంద్రాలలో పని చేస్తున్న జర్నలిస్టులందరికీ నివాస స్థలాలు పంపిణీ చేసేవిధంగా స్థానిక శాసన సభ్యులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని అందరికీ నివాస స్థలాలు ఇచ్చేవిధంగా జీవోను విడుదల చేయాలని ఆయన కోరారు.

టియుడబ్ల్యూజె (ఐజెయు) చేపట్టిన పోస్టుకార్డు ఉద్యమానికి జిల్లా వ్యాప్తంగా మంచి స్పందన లభించింది. కొన్ని సెంటర్లలో పోస్ట్ కార్డులు లభించలేదు … దాదాపు అన్ని మండలాల్లోనూ ఈ కార్యక్రమం స్థానిక యూనియన్ నేతలు చేపట్టారు. ఖమ్మంలో జరిగిన కార్యక్రమంలో టియుడబ్ల్యూజె (ఐజెయు) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వనం వెంకటేశ్వర్లు, ఏనుగు వెంకటేశ్వరరావు, జిల్లా కోశాధికారి శివానంద, రాష్ట్ర నాయకులు సర్వనేని వెంకట్రావు, సామినేని కృష్ణమురారి, నగర అధ్యక్ష, కార్యదర్శులు మైసా పాపారావు, చెరుకుపల్లి శ్రీనివాస్, జిల్లా నాయకులు నలజాల వెంకట్రావు, ఎస్కె మోహినుద్దీన్, వై. జనార్ధనాచారి, తాళ్లూరి మురళి, ప్రెస్ క్లబ్ కోశాధికారి నామ పురుషోత్తం, నగర కోశాధికారి రాయల బసవేశ్వరరావు, యూనియన్ నాయకులు మేడి రమేష్, సత్యనారాయణ, కళ్యాణ్, ఏలూరి వేణుగోపాల్, కమటం శ్రీనివాస్, మధులత, సాగర్ రెడ్డి, మురళీధర్రెడ్డి, తాళ్లూరి వెంకటేశ్వరరావు, గడల నర్సింహారావు, మణికుమార్, రాంబాబు, ప్రసాద్, శ్రీధర్, రాయల సతీష్, కిరణ్, మాధవరావు, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.

జనగాం ,పెద్దపల్లి వరంగల్ , హమమకొండ , జయశంకర్ భూపాలపల్లి మెదక్ , సిద్ధిపేట ,కరీంనగర్ ,ఖమ్మం ,భద్రాద్రి కొత్తగూడెం ,వనపర్తి ,రంగారెడ్డి ,మేడ్చల్ ,హైదరాబాద్ , వికారాబాద్ , మహబూబ్ నగర్ ,నగర్ కర్నూల్ , మంచిర్యాల , నిజామాబాద్ , సూర్యాపేట , నల్లగొండ , బోనగిరి , సంగారెడ్డి , ఆదిలాబాద్ మహబూబాబాద్ ,ములుగు లాంటి జిల్లా కేంద్రాలలోనే కాకుండా మండల కేంద్రాల నుంచి సీఎం కేసీఆర్ పేరుతొ ప్రగతి భవనం కు ఇళ్లస్థలాలు , హెల్త్ కార్డులకోసం పోస్ట్ కార్డు ఉద్యమానికి వచ్చిన స్పందన అనుహ్యం …ఇప్పటికే 8 వేలకు పైగా పోస్ట్ కార్డు లను జర్నలిస్టులు టీయూడబ్ల్యూ జె ( ఐజేయూ ) నాయకత్వంలో సీఎం కేసీఆర్ కు చేరాలా ప్రగతి భవనం కు పోస్టు చేశారు ….ఇక ఈ ప్రక్రియ కొనసాగుతుంది….

Related posts

తెలంగాణ ఎన్నికల్లో డాక్టర్ల హవా

Ram Narayana

బీఆర్ఎస్ లో చేరబోతున్నారనే వార్తలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందన!

Drukpadam

భద్రాద్రి జిల్లాలో పెద్దవాగుకు గండి.. హెలికాప్టర్ సాయంతో కూలీల ప్రాణాలు కాపాడిన ఎన్డీఆర్ఎఫ్..!

Ram Narayana

Leave a Comment