Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలురాజకీయ వార్తలు

కేటీఆర్… ఇంత విధ్వంసం జరుగుతుంటే సమీక్ష చేసే టైమ్ లేదా?: రేవంత్ రెడ్డి

  • వరద బాధిత కుటుంబాలకు రూ.10వేల ఆర్థిక సాయం చేయాలని కేటీఆర్‌కు లేఖ
  • ప్రజలు రోడ్ల మీదకు రావాలంటే ఆలోచిస్తున్నారన్న రేవంత్
  • మళ్లీ రెడ్ అలర్ట్ ప్రకటించినా ముందస్తు జాగ్రత్తలేవని ప్రశ్న?

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సోమవారం ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు లేఖ రాశారు. భారీ వర్షాల కారణంగా చాలామంది నష్టపోయారని, వరదలతో ఇళ్లు కూలిపోయాయని, ఈ నేపథ్యంలో వరద బాధితులకు ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలమైందని, దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని, అలాగే వరద బాధిత కుటుంబాలకు రూ.10వేల ఆర్థిక సాయం ఇవ్వాలన్నారు.

ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూస్తోందని ఉద్దెర ముచ్చట చెప్పడం కాదని, కనీసం ఈ పరిస్థితుల్లో బయటకు రావాలంటే నగర ప్రజలు ఆలోచిస్తున్నారన్నారు. వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయని, దీంతో ఎక్కడ మ్యాన్ హోల్ ఉంది? ఎక్కడ గుంత ఉంది? తెలియక ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని తిరగాల్సి వస్తోందన్నారు. హైదరాబాద్‌ను డల్లాస్, పాత బస్తీని ఇస్తాంబుల్ చేస్తామని ప్రగల్బాలు పలికారని, కానీ వర్షాలకు రోడ్లు నీట మునిగాయన్నారు. భాగ్యనగరంలో ఇంత విధ్వంసం జరుగుతుంటే కనీసం సమీక్ష చేసే సమయం మంత్రిగా మీకు లేదా? అని ఆ లేఖలో కేటీఆర్‌ను ప్రశ్నించారు. వాతావరణ శాఖ మరోసారి రెడ్ అలర్ట్ ప్రకటించిందని, అయినా ఎలాంటి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదన్నారు.

Related posts

ఈటలపై వేటు శాఖ లేని మంత్రిగా …. చాలాసంతోషమన్న మంత్రి

Drukpadam

అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీని….సీఎం జగన్ ఆదేశాలు…

Drukpadam

ది క‌శ్మీర్ ‘ఫైల్స్‌’పై కేసీఆర్ విసుర్లు!

Drukpadam

Leave a Comment