Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

రైతు రుణమాఫీ సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ …ఇది కాంగ్రెస్ ఘనతే అంటున్న రేవంత్ రెడ్డి

రైతు రుణమాఫీ పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశం

  • కేంద్రం తీరు వల్లే రుణమాఫీ జాప్యమైనట్లు ఆరోపణ
  • నిధుల విషయంలో కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శ
  • సెప్టెంబర్ 2వ వారం లోపు రుణమాఫీ పూర్తి చేయాలని ఆదేశం

గత ఎన్నికల్లో చేస్తామన్న రుణమాఫీ కేసీఆర్ సర్కార్ చేయకుండా గత నాలుగున్నర సంవత్సరాలుగా జాప్యం చేస్తూ వచ్చింది. ..దీనిపై విపక్షాలు కేసీఆర్ వాగ్దానభంగం చెందారని రైతుల రుణమాఫీ పై మాట తప్పారని విమర్శలు గుప్పిస్తున్నాయి. ఎన్నికలు మరో రెండు మూడు నెలల్లో జరగనున్న తరణంలో రైతుల రుణమాఫీ పై సీఎం కేసీఆర్ స్పందించారు . సెప్టెంబర్ మొదటి వారం లోగ రైతు రుణమాఫీ పూర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేశారు . దీనిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందిస్తూ తాము అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పినందునే కేసీఆర్ రుణమాఫీ నిర్ణయం తీసుకున్నారని అన్నారు .

రైతు రుణమాఫీ పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఆదేశించారు. రేపటి నుండి రైతు రుణమాఫీ తిరిగి ప్రారంభించాలన్నారు. కేంద్రం తీరు వల్లే రుణమాఫీ జాప్యమైనట్లు తెలిపారు. తెలంగాణకు ఇవ్వాల్సిన నిధుల విషయంలో కేంద్రం కక్షపూరితంగా వ్యవహరించడం వల్లే రుణమాఫీ ఆలస్యమైందన్నారు. ఎఫ్ఆర్‌బీఎం నిధుల్లో కేంద్రం ఏకపక్షంగా కోత విధించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతులకు మరో రూ.19వేల కోట్ల రుణాలను అందించాల్సి ఉందని, ఈ నేపథ్యంలో రుణమాఫీని మళ్లీ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. రేపటి నుండి రైతు రుణమాఫీని ప్రారంభించి, సెప్టెంబర్ 2వ వారం లోపు పూర్తి చేయాలని ఆదేశించారు.

రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణకు ఇవే చివరి సమావేశాలు. మొదటి దఫా రుణమాఫీ తర్వాత నిలిపివేయడంతో ప్రతిపక్షాలు ఎప్పటికప్పుడు నిలదీస్తున్నాయి. ఎన్నికలకు ముందు అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలకు రుణమాఫీ ఆయుధంగా మారనున్న నేపథ్యంలో కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకుంటున్నారని చెబుతున్నారు.

Related posts

కేసీఆర్ పాలన మోసం దగా…420 కేసు పెట్టాలి…పొంగులేటి సుధాకర్ రెడ్డి ..!

Ram Narayana

మణిపూర్ నిందితులను కఠినంగా శిక్షించాలి…సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని

Ram Narayana

మా లక్ష, లక్ష్యం నెరవేరింది…రండి తలలు లెక్కపెట్టుకోండి …కూనంనేని సవాల్ …

Drukpadam

Leave a Comment