తెలంగాణ వార్తలురాజకీయ వార్తలు

మొత్తానికి కాంగ్రెస్‌లో చేరిన జూపల్లి.. కండువా కప్పిన ఖర్గే

  • జూపల్లితోపాటు కాంగ్రెస్‌లో చేరిన కూచుకుళ్ల, మెగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి
  • పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన జూపల్లి చేరిక
  • హాజరైన రేవంత్, ఉత్తమ్‌కుమార్, కేసీ వేణుగోపాల్ తదితరులు

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎట్టకేలకు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఈ ఉదయం కాంగ్రెస్‌లో చేరారు. ఆయనతోపాటు కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, వనపర్తికి చెందిన మెగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి సహా పలువురు నేతలు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఇన్‌చార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సంపత్ తదితరులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

వాస్తవానికి జూపల్లి గత నెల 20నే కాంగ్రెస్‌లో చేరాల్సి ఉండగా అప్పటి నుంచి ఇది వాయిదా పడుతూ వస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రియాంక గాంధీ సమక్షంలో పార్టీలో చేరాలని జూపల్లి భావించారు. భారీ వర్షాల కారణంగా అది రద్దయింది. ఆ తర్వాత గత నెల 30న మరో ముహూర్తం ఖరారు చేసినా అది కూడా వాయిదా పడింది. చివరికి నిన్న చేరాలని భావించి ఢిల్లీ వెళ్లినా ఖర్గే అందుబాటులో లేకపోవడంతో కుదరలేదు. చివరికి ఈ ఉదయం ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

Related posts

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో 3,000 డ్రోన్‌లతో షో.. గిన్నిస్ రికార్డు..

Ram Narayana

రాష్ట్రానికి మేలు చేసే పార్టీకే మా మద్దతు : వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి!

Drukpadam

మేడిగడ్డ కుంగుబాటుకు బీఆర్ఎస్ కారణమంటూ కేసు వేసిన రాజలింగమూర్తి దారుణ హత్య!

Ram Narayana