Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

టీయూడబ్ల్యూజే (ఐజేయూ )కృషి ఫలితం …జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ..

టీయూడబ్ల్యూజే (ఐజేయూ )కృషి ఫలితం …జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ..
జర్నలిస్టు పిల్లలకు ప్రైవేట్ స్కూల్లో 50శాతం ఫీజు రాయితీ
“అన్ని స్కూళ్లకు సర్క్యులర్ జారీ చేసిన డీఈవో “
ఖమ్మం జిల్లా డి ఈ ఓ కు కృతజ్ణతలు తెలిపిన యూనియన్
దీన్ని వినియోగించుకోవాలని జర్నలిస్టులకు విజ్ఞప్తి

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (టీయూడబ్ల్యూజే -ఐజేయు) ఖమ్మం జిల్లా కమిటీ విజ్ఞప్తి మేరకు జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ కల్పిస్తూ ఖమ్మం డీఈఓ సోమశేఖర శర్మ సర్క్యూలర్ జారీచేశారు …ఈ సర్క్యూలర్ ఖమ్మం జిల్లాలో పనిచేసే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల పిల్లలకు వర్తిస్తుందని అన్నారు . ఖమ్మం జిల్లాలో ని
అన్ని ప్రైవేట్ పాఠశాలలో 50 శాతం ఫీజు రాయితీ కల్పిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి సర్క్యులర్ జారీ చేయడంపట్ల యూనియన్ నేతలు ఆయనకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు . గురువారం డీఈఓ తన కార్యాలయంలో సర్క్యులర్ కాపి ని టియూడబ్ల్యూజే (ఐజేయు) ఖమ్మం జిల్లా కమిటీ బాధ్యులకు అందజేశారు. సమాజ హితం కోసం పనిచేసే జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజు రాయితీ కల్పించాలని తమ యూనియన్ చేసిన విజ్ఞప్తి మేరకు సానుకూలంగా స్పందించిన డీఈవో వెంటనే సర్క్యులర్ జారీ చేస్తూ అన్ని ప్రైవేటు విద్యాసంస్థలకు, ప్రైవేట్ పాఠశాల యజమానుల సంఘానికి, మండల విద్యాశాఖ అధికారులకు పంపించారని, కావున జిల్లాలోని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులంతా ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్, టీయూడబ్ల్యూజే ఐజేయు నగర కార్యదర్శి చెరుకుపల్లి శ్రీనివాసరావు, జిల్లా నాయకులు వై మాధవరావు జనార్ధన చారి తదితరులు పాల్గొన్నారు

Related posts

మణుగూరులో స్వల్ప భూప్రకంపనలు

Ram Narayana

మంత్రి పొంగులేటి దిద్దుబాటు చర్యలు …మీ ముగింటకు మీ ఎమ్మెల్యే పేరుతో పర్యటనలకు శ్రీకారం …

Ram Narayana

ప్రశాంత ఖమ్మం కోసం కాంగ్రెస్ పార్టీ నే గెలిపించాలని తుమ్మల పిలుపు…1

Ram Narayana

Leave a Comment