Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

కోకాపేటలో అత్యధికంగా ఎకరా భూమి రూ.100 కోట్లు

హైదరాబాద్ చరిత్రలో రికార్డ్… కోకాపేటలో ఎకరం రూ.100 కోట్లు, కొనుగోలు చేసిందెవరంటే..!

  • నియోపోలిస్ ఫేజ్-2లో ప్లాట్ నెంబర్ 6, 7 , 8 , 9లలో వేలం
  • ప్లాట్ నెంబర్ 10లో ఏకంగా రూ.100 కోట్లు దాటిన ఎకరా భూమి ధర
  • కొనుగోలు చేసింది సెల్వన్ కంపెనీ 
  • ఈ-వేలం ద్వారా వచ్చిన రూ.1,532 కోట్ల ఆదాయం

కోకాపేటలో ఎకరా భూమి రూ.100 కోట్లకు పైగా పలికింది. ఇక్కడి నియోపోలిస్ ఫేజ్-2లో ప్లాట్ నెంబర్ 6, 7 , 8 , 9లను హెచ్ఎండీఏ వేలం వేసింది. ఈ వేలంలో భూముల ధర హైదరాబాద్ చరిత్రలోనే సరికొత్త రికార్డును నమోదు చేసింది. ప్లాట్ నెంబర్ 10లో ఎకరా భూమి ధర ఏకంగా రూ.100.25 కోట్లు పలికింది. హెచ్ఎండీఏ ఎకరం భూమికి రూ.35 కోట్లుగా బిడ్డింగ్ ప్రారంభ ధరను నిర్ణయించింది. అయితే ఈ వేలంలో రియల్ ఎస్టేట్ సంస్థలు పోటాపోటీగా పాల్గొన్నాయి. దీంతో చరిత్రలోనే అత్యధిక ధర నమోదయింది.

ప్లాట్ నెంబర్ 10లో 3.6 ఎకరాలు ఉండగా, ఈ-వేలం ద్వారా రూ.360 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ఈ భూమిని కొనుగోలు చేసింది సెల్వన్ కంపెనీగా తెలుస్తోంది. ప్లాట్ నెంబర్ 9లో ఎకరాకు రూ.76.5 కోట్ల చొప్పున మొత్తం రూ.250 కోట్ల ఆదాయం వచ్చింది. ఇదిలా ఉండగా, ఎకరం ధర అత్యల్పంగా రూ.51.75 కోట్లు పలికింది. ఇక గజం ధర సరాసరిని 1.5 లక్షలు పలకడం విశేషం. నియో పోలిస్ ఫేజ్ 2లోని ఈ నాలుగు ప్లాట్ల వేలం ద్వారా హెచ్ఎండీఏకు రూ.1,532.20 కోట్ల ఆదాయం సమకూరింది. 45 ఎకరాలలో వున్న 7 ప్లాట్లకు ప్రభుత్వం రూ.2500 కోట్ల ఆదాయాన్ని అంచనా వేయగా.. నేటి తీరు చూస్తే మరింత ఆదాయం సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ప్లాట్ల వేలంలో షాపూర్ జీ పల్లోంజీ, ఎన్సీసీ, మైహోం, రాజ్ పుష్పా తదితర రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలు పాల్గొన్నట్లుగా తెలుస్తోంది.

హైద్రాబాద్ లో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కోకాపేటలో ఉన్న ప్రభుత్వ భూమిని అమ్మడం ద్వారా నిధులు సమకూర్చుకోవాలని భావించిన హెచ్ ఎం డి ఏ గురువారం మినిమమ్ ధర 33 కోట్లుగా నిర్ణయించి వేలంపాట పెట్టింది. బిడ్డర్లు పాల్గొని అత్యధికంగా ఎకరం రూ.100 కోట్లకు పైగా పలికింది . అత్యల్పంగా 51 ఫలికింది. ఇక్కడ మొత్తం 45.33 ఎకరాల్లో ఉన్న ఏడు ప్లాట్‌లతో రూ.2,500 కోట్ల వరకు సమీకరించాలని హెచ్ఎండీఏ భావించింది. అయితే అంతకు మించి ఆదాయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు ..

కోకాపేట భూముల ధరలు అంచనాలు మించాయి. నిధుల సమీకరణ కోసం హెచ్ఎండీఏ కోకాపేట నియోపోలిస్ లే-అవుట్‌లోని ప్లాట్ నెంబర్ 6, 7, 8, 9లోని భూముల విక్రయ ప్రక్రియను గురువారం చేపట్టింది. భూముల ధరలు రికార్డ్‌స్థాయిలో పలికాయి. అత్యధికంగా ఎకరం భూమి ధర రూ.72 కోట్లు, అత్యల్పంగా రూ.51 కోట్లు పలికింది. 

మొదటి విడతలో హెచ్ఎండీఏకు రూ.1,533 కోట్ల ఆదాయం సమకూరింది. సగటున గజం భూమి ధర రూ.1.5 లక్షలు పలికింది. మొత్తం 45.33 ఎకరాల్లో ఉన్న ఏడు ప్లాట్‌లతో రూ.2,500 కోట్ల వరకు సమీకరించాలని హెచ్ఎండీఏ భావించింది. ప్రభుత్వం కనీస ధరను ఎకరానికి రూ.35 కోట్లుగా నిర్ణయించింది. కానీ ఇక్కడి భూముల ధరలు అంతకుమించి పలికాయి.

Related posts

హైదరాబాద్‌లోనూ హిజాబ్ వివాదం.. హోం మంత్రి మహమూద్ అలీకి ఫిర్యాదు..!

Drukpadam

గండం నుంచి గట్టెక్కిన తమ్మినేని… మొఖంలో చిరునవ్వు …

Ram Narayana

ఫోన్ ట్యాపింగ్ కేసు.. ‘రాధాకిషన్‌రావు బ్యాచ్’ దారుణం మరోటి వెలుగులోకి..!

Ram Narayana

Leave a Comment