వనమాకు సుప్రీం లో బిగ్ రిలీఫ్ …హైకోర్టు తీర్పుపై స్టే
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమానే…జలగం వెంకట్రావు కు నిరాశ …
రెండువారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలనీ ప్రతివాదులకు ఆదేశాలు..
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు ఎన్నిక చెల్లదని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్ట్ స్టే విధించడంపై వనమాకు బిగ్ రిలీఫ్ దొరికింది … ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు ఎన్నిక చెల్లదని ఇటీవలనే తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అంతే కాకుండా ఎన్నికల్లో రెండవస్థానంలో ఉన్న జలగం వెంకట్రావు ను ఎమ్మెల్యేగా గత ఎన్నికల నాటినుంచి పరిగణించాలని హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. దీనిపై వనమా హైకోర్టు లో తీర్పుపై స్టే ఇవ్వాలని అప్పీల్ చేసుకున్నారు . దాన్ని విచారించిన హైకోర్టు స్టే ఎత్తి వేయడం కుదరదని తేల్చి చెప్పింది. దీంతో నాలుగురోజులు పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాలకు వనమా హాజరు కాలేక పోయారు . అదే సందర్భంలో కోర్ట్ తీర్పు ప్రకారం జలగం వెంకట్రావు తనను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించాలని శాసనసభ స్పీకర్ కు అప్పీల్ చేసుకున్నారు . ఆయన సూచన మేరకు అసెంబ్లీ సెక్రటరీని కలిసి హైకోర్టు తీర్పు ను వివరించారు . తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారిని కలిసి హైకోర్టు కాపీలు అందించారు . దీనిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల కమిషన్ అధికారి చెప్పారు . దీంతో జలగం కూడా అసెంబ్లీ సమావేశాలకు వెళ్లడం కుదరలేదు . రాష్ట్ర గెజిట్ లో జలగం పేరు చేర్చలేదు . దీంతో వనమా హైకోర్టు తీర్పు పై సుప్రీంను ఆశ్రయించారు . దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్ట్ ,హైకోర్టు తీర్పు పై స్టే విధిస్తు ఉత్తర్వులు జారీచేసింది. దీంతో వనమా వెంకటేశ్వరావు కు బిగ్ రిలీఫ్ దొరికినట్లు అయింది. వనమా అనుయాయులు సంబరాలు జరుపుకుంటున్నారు … జలగం వెంకట్రావు ఆయన అనుయాయులు నిరాశకు గురైయ్యారు .