Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

గద్దర్ పార్థివదేహానికి కేసీఆర్ నివాళులు.. గద్దర్ భార్యకు సోనియా గాంధీ సంతాప లేఖ

  • అల్వాల్‌లో గద్దర్ పార్థివదేహానికి నివాళులర్పించిన కేసీఆర్
  • కుటుంబ సభ్యులను పరామర్శించిన ముఖ్యమంత్రి
  • వెంట మహమూద్ అలీ, తలసాని, హరీశ్ రావు

విప్లవ వీరుడు గద్దరన్నకు కన్నీటి వీడ్కోలు …సీఎం కేసీఆర్ నివాళు

.

విప్లవ వీరుడు గద్దరన్నకు కన్నీటి వీడ్కోలు …సీఎం కేసీఆర్ నివాళు
వేలాదిగా తరలివచ్చిన కళాకారులూ ..అభిమానులు
17 కి .మీ మేర సాగిన అంతిమయాత్ర …

ప్రజాగళం, ప్రజాబలం , మానవత్వం మూర్తీభవించిన మహానేత …కష్టాల్లో ఉన్న బలహీనవర్గాలకు అండగా ఉన్న వాగ్గేయకారుడు ఈలోకాన్ని విడిచి వెళ్లిపోయారు …ఆయన ఆకస్మిక మరణంపట్ల యావత్ దేశం దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. సోమవారం ఆయన అంత్యక్రియలు ఆయన కోరిక ప్రకారం బోధి విద్యాలయంలో జరిపారు . బౌద్ధ ఆచారాల ప్రకారం అంత్యక్రియలను కుటుంబసభ్యులు నిర్వహించారు . రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గద్దర్ అంత్యక్రియల్లో పాల్గొని నివాళులు అర్పించారు . కుటుంబసభ్యులను ఓదార్చారు . సీఎం వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు .

ఎల్బీ స్టేడియం నుంచి ప్రారంభమైన అంతిమ యాత్ర 17 కి .మీ సాగి అల్వాల్ లోని తన స్వగృహానికి చేరుకుంది . వేలాది మంది అభిమానులు పార్థివదేహాన్ని అనుసరిస్తుండగా ఆయన అంతిమయాత్రసాగింది . జోహార్ గద్దర్ అంటూ అభిమానులు, సన్నిహితులు, అనుచరులు నినదించారు . గన్ పార్క్, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్తూపం, ట్యాంక్ బండ్ మీదుగా సాగిన ఈయాత్రలో వేలాదిమంది పాల్గొన్నారు . తన నివాసంలో గద్దర్ పార్థివ దేహాన్ని కాసేపు ఉంచారు . అనంతరం తాను ఏర్పాటు చేసిన బోధి విద్యాలయంలో గద్దర్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. బౌద్ధమత సంప్రదాయాల ప్రకారం దహనసంస్కారాలు కుటుంబసభ్యులు నిర్వహించారు . ఒక్కడికి వచ్చిన అభిమానులు కళాకారులు , కన్నీటి పరవంతమైయ్యారు ..కడసారి తమ అభిమాన నాయకుడిని చూసుకున్నారు . ఆప్రాంతమంతా రోదనలతో మిన్నంటింది.

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అల్వాల్‌లోని గద్దర్ నివాసానికి చేరుకొని, గద్దర్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. గద్దర్ కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి ఓదార్చారు. కేసీఆర్‌తో పాటు ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హరీశ్ రావు నివాళులర్పించారు. అల్వాల్‌లోని మహాభోది స్కూల్‌లో గద్దర్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

మరోపక్క, గద్దర్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ సంతాపం తెలిపారు. ఈ మేరకు గద్దర్ భార్య విమలారావుకు లేఖ పంపించారు. అలాగే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నివాళులర్పిస్తూ ‘అశేష జనదారులు.. అనేక అశృధారలు.. గద్దరన్న సంపాదించుకున్న ఆస్తి. ధన్యజీవి… నిన్ను మరువదు ఈ గడ్డ’ అంటూ ట్వీట్ చేశారు.

Related posts

భద్రాచలం ఆలయంలో విమానం వెళ్తున్నట్టు వింత శబ్దాలు.. భయపడుతున్న భక్తులు

Ram Narayana

ట్రాఫిక్‌ చలానాలపై మరోసారి భారీ రాయితీ.. సన్నద్ధమవుతున్న తెలంగాణ పోలీసు శాఖ

Ram Narayana

రైతు రుణమాఫీ సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ …ఇది కాంగ్రెస్ ఘనతే అంటున్న రేవంత్ రెడ్డి

Ram Narayana

Leave a Comment