Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

అమెరికా నౌకను స్వాధీనం చేసుకున్న ఇరాన్… తీవ్రస్థాయిలో స్పందించిన అగ్రరాజ్యం

  • ఎర్రసముద్రంలో తమ నౌకను ఇరాన్ స్వాధీనం చేసుకుందని అమెరికా ఆరోపణ
  • 3 వేల మంది సైనికులను తరలించిన అగ్రరాజ్యం
  • ఎర్ర సముద్రంలో ఉద్రిక్తత

అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ మరోసారి ఆగ్రహం తెప్పించింది. కొన్నిరోజుల కిందట అమెరికాకు చెందిన ఓ వాణిజ్య నౌకను ఇరాన్ బలగాలు స్వాధీనం చేసుకోవడంతో అమెరికా అగ్గిమీద గుగ్గిలంలా మండిపడుతోంది. ఇరాన్ చర్య పట్ల తీవ్రస్థాయిలో స్పందించిన అగ్రరాజ్యం వెంటనే రెండు నౌకల్లో 3 వేల మంది సైనికులను ఎర్ర సముద్రానికి తరలించింది. ఈ మేరకు అమెరికా 5వ ఫ్లీట్ కమాండర్ నుంచి ప్రకటన వెలువడింది. 

కాగా, ఇటీవల కాలంలో ఎర్ర సముద్రం అంతర్జాతీయ జలాల్లో ప్రవేశించిన తమ నౌకలను ఇరాన్ స్వాధీనం చేసుకుంటోందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ క్రమంలో తమ నౌకల జోలికి వస్తే ఇరాన్ కు తగిన బుద్ధి చెప్పేందుకే తాజాగా అమెరికా పెద్ద సంఖ్యలో బలగాలను ఎర్ర సముద్రానికి తరలించినట్టు భావిస్తున్నారు. అమెరికా బలగాలు మోహరించిన నేపథ్యంలో ఎర్ర సముద్రంలో ఉద్రిక్తత నెలకొంది.

Related posts

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్ ను కనుగొన్న ఖగోళ శాస్త్రవేత్తలు…

Ram Narayana

అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ పై స్పందించిన అమెరికా

Ram Narayana

కాలిఫోర్నియాలో ఎగసిపడుతున్న రాకాసి అలలు.. తీరప్రాంతాల మూసివేత

Ram Narayana

Leave a Comment