Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తిరుమల మెట్ల మార్గంలో చిరుతలు .. ఎలుగుబంటి కలకలం!

తిరుమల మెట్ల మార్గంలో చిరుతలు .. ఎలుగుబంటి కలకలం!
ఎలుగుబంటిని చూసి భయాందోళనకు గురైన భక్తులు
వెంటనే అధికారులకు సమాచారం అందజేత
జాగ్రత్తగా వెళ్లాలని మిగతా భక్తులకు సూచన
తిరిగి అడవిలోకి వెళ్లిపోయిన ఎలుగు బంటి

తిరుమల వెళ్లి భక్తులకు స్వామి వారిని దర్శనం కోసం కాలినడకన వెళ్లడం …ఆవిధంగా ముక్కుకోవడం చేస్తుంటారు .మొక్కులు చెల్లించుకునేందుకు పిల్లాపాపలతో సహా అలిపిరి , అన్నయ్య దారి మార్గాల ద్వారా తిరుమలకు చేరుకుంటారు . ఇందులో అలిపిరి ద్వారానే అధికంగా భక్తులు కాలినడక వెళ్లడం ఆనవాయితీగా మారింది. అయితే ఈ మార్గంలో చిరుతలు , ఎలుగు బంట్లు తిరగటం భక్తులపై దాడిచేయడం లాంటి సంఘటనలు వెలుగుచూడటం జరుగుతుంది. గత నెలలలో ఒక బాలున్ని ఎత్తుకొని వెళ్లిన చిరుత చివరకు ప్రాణాలతో వదిలింది. అయితే గత నాలుగు రోజుల క్రితం నెల్లూరు జిల్లాకు చెందిన ఒక పాపను ఎత్తుకెళ్ళి చంపింది ..దీంతో భక్తులు హడలిపోతున్నారు ..

ఈ ఘటనను మరువకముందే ఇప్పుడు శ్రీవారి మెట్ల మార్గంలో ఎలుగుబంటి కలకలం సృష్టించింది. ఈ రోజు ఉదయం 2 వేల నంబర్ మెట్టు దగ్గర భక్తులకు ఎలుగు కనిపించింది.

అడవిలో నుంచి ఎలుగు రావడాన్ని గుర్తించిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు మైకుల్లో ప్రకటన చేశారు. నడక దారిలో వస్తున్న మిగతా భక్తులను అప్రమత్తం చేశారు. ఎలుగుబంటి తిరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా వెళ్లాలని సూచించారు. ఎలుగు తిరిగి అడవిలోకి వెళ్లిపోవడంతో భక్తులు, అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

శేషాచలం ప్రాంతంలో 25 నుంచి 30 చిరుతలు ఉన్నాయన్న డీఎఫ్ఓ

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తుల్లో చాలామంది నడక మార్గంలో కొండపైకి వెళ్తుంటారు. గోవింద నామ స్మరణ చేసుకుంటూ, మార్గమధ్యంలో ఉండే పలు ఆలయాలలో పూజలు చేస్తూ వారు తిరుమల చేరుకుంటారు. అయితే, ఇప్పుడు నడక మార్గంలో వెళ్లాలంటేనే భక్తులు ఒకటి, రెండు సార్లు ఆలోచించే పరిస్థితి నెలకొంది. నడకమార్గంలో చిరుతలు బెంబేలెత్తిస్తున్నాయి. ఇటీవల ఓ బాలికను చిరుత చంపేయడం భక్తులను భయభ్రాంతులకు గురి చేస్తోంది.

మరోవైపు, ఈ తెల్లవారుజామున అలిపిరి నడక మార్గంలో ఏడో మైలురాయి వద్ద చిరుత బోనులో చిక్కింది. ఈ సందర్భంగా డీఎఫ్ఓ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ… శేషాచలం అటవీ ప్రాంతంలో 25 నుంచి 30 వరకు చిరుతలు ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు పట్టుబడింది ఆడ చిరుత అని, దీనికి మూడేళ్ల వయసు ఉంటుందని చెప్పారు. బాలికను చంపిన చిరుత, ఇప్పుడు పట్టుబడిన చిరుత రెండూ ఒకటేనా అనే విషయాన్ని పరీక్షలు జరిపి నిర్ధారిస్తామని తెలిపారు. నడక మార్గం పరిధిలో ఎన్ని చిరుతలు సంచరిస్తున్నాయో అధ్యయనం చేస్తామని చెప్పారు. ప్రతి కిలోమీటర్ పరిధిలో 500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి చిరుతల సంచారాన్ని గుర్తిస్తామని తెలిపారు.

Related posts

రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన హైకోర్టు…

Drukpadam

ఎన్నికల ప్రచారంలో కళ్లు తిరిగి పడిపోయిన కవిత.. వీడియో ఇదిగో!

Ram Narayana

పవన్ రాజకీయాలకు మాజీ భార్య రేణు దేశాయ్ మద్దతు…!

Ram Narayana

Leave a Comment