Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలురాజకీయ వార్తలు

నాదే సీటు …కందాల……పోటీ ఖాయం తుమ్మల …పొత్తులో మాదే…తమ్మినేని …

నాదే సీటు …కందాల……పోటీ ఖాయం తుమ్మల …పొత్తులో మాదే…తమ్మినేని ..
రసకందాయంలో బీఆర్ యస్ పాలేరు రాజకీయాలు ….
ఎన్నికల కదన రంగంలో హేమ హేమీలు …
ఎవరికీ వారే ధీమా …కేసీఆర్ మొగ్గు ఎటు వైపు అనేదానిపై మీమాంశ..

పాలేరు ఒకప్పుడు కమ్యూనిస్టుల గడ్డ …కాంగ్రెస్ కు కంచుకోట …నేడు బీఆర్ యస్ అడ్డా …. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున గెలిచి అయాచితంగా అధికార బీఆర్ యస్ లో చేరిన ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి వల్ల బీఆర్ యస్ కేంద్రంగా మారింది…పాలేరు బీఆర్ యస్ లో అంతర్గత పోరు మొదటి నుంచి జరుగుతుంది … కందాల , తుమ్మల రెండు శిభిరాలుగా విడిపోయారు … ప్రత్యర్థులకంటే ఎక్కువగా తలపడుతున్నారు .పరస్పరం కేసులు , కొట్లాటలు జరుగుతున్నాయి… అయినప్పటికీ తుమ్మల నాగేశ్వరావు , కందాల ఉపేందర్ రెడ్డి ఎవరికీ వారి తమకే సీటు అనే ధీమాతో ఉన్నారు .

సిట్టింగులందరికి టిక్కెట్లు ఇస్తామని అధినేత కేసీఆర్ హామీతో సీటు నాదే …గెలుపు నాదే అని కందాల అంటున్నారు . గత ఎన్నికల్లో తన ఓటమికి కారణాలు కేసీఆర్ కు తెలుసునని అందువల్ల తనకు సీటు ఖాయమనే నమ్మకంతో తుమ్మల ఉన్నారు . సిపిఎం, సిపిఐ తో కలిసి నడవాలంటే , ఉమ్మడి ఖమ్మం , నల్లగొండ జిల్లాలో అధికార పార్టీకి సీట్లు రావాలంటే లెఫ్ట్ తో దోస్తీ అవసరమని , అందువల్ల పాలేరు తమకు ఇవ్వక తప్పదని సిపిఎం ధీమాతో ఉంది .పైగా ఇక్కడ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పోటీచేస్తారని ప్రచారం జరుగుతుంది…ఎవరికీ వారు పాలేరు లో పోటీకి సై అంటున్నారు .

2015 లో జరిగిన ఉప ఎన్నికల్లో మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరావు టీఆర్ యస్ అభ్యర్థిగా పోటీచేసి గెలిచినప్పటికీ అది కొద్దీ కాలమే…. అదికూడా రాష్ట్ర అధికార యంత్రాంగం మంత్రులు ,ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు కేంద్రీకరించి పనిచేసిన నేపథ్యంలో అదిసాధ్యం అయింది ..ఉన్న రెండు ,మూడు సంవత్సరాల్లో తుమ్మల మంత్రిగా నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించారు .కారణాలు ఏమైనా ఆయనకు సైతం ఓటమి తప్పలేదు …దీంతో తుమ్మల తిరిగి పాలేరు లో గెలిచి తన రాజకీయ జీవితానికి గౌరవప్రదమైన ముగుంపు ఇవ్వాలనే పట్టుదలతో ఉన్నారు . అందుకు అనుగుణంగా తన యంత్రాంగాన్ని సిద్ధం చేసుకుంటున్నారు …పాలేరు పర్యటనల జోరు పెంచారు …పోటిఖాయమంటున్నారు .. కేసీఆర్ నుంచి గట్టి హామీ లభించకపోతే తుమ్మల ఆవిధంగా మాట్లాడతారా …? అంటే చెప్పలేని పరిస్థితి …

మళ్ళీ ఎన్నికలు సమీపిస్తుండటంతో పాలేరు సీటు ఎవరికీ ఇస్తారు అనేది హాట్ టాపిక్ గా మారింది…సహజంగానే సీటింగ్ లకే సీట్లు అని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో ఎమ్మెల్యే కందాల గంపెడు ఆశతో ఉన్నారు . సీటు నాదే గెలిచిదీ నేనే అంటున్నారు .నియోజకవర్గంలో తాను ప్రజలకు చేసిన సహాయాన్ని గుర్తు చేస్తున్నారు. ఎప్పుడు ఏ అవసరం ఉందని ఎవరు వచ్చినా, తన అండదండలు అందించిన తీరును ప్రస్తావిస్తున్నారు . కందాలకు ప్రజల్లో వ్యతిరేకత లేదు …అని అంతా అనుకూలత ఉందని చెప్పలేము …కాకపోతే మంచి వ్యక్తి అనే పేరు సంపాదించుకున్నారు …గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నిలిచి గెలిచారు .అప్పడు ఆయన ఓటర్లకు తగినంత సహాయం అందించలేక పోయినప్పటికీ రెండు మూడు సార్లు టికెట్ కోసం ప్రయత్నించి భంగపడి చివరకు టికెట్ పొందడంతో బలమైన మంత్రి తుమ్మలను ఓడించి కాంగ్రెస్ ను గెలిపించారు పాలేరు ప్రజలు … తర్వాత భక్త రామదాసు ప్రాజక్ట్ తెచ్చి కరువు మండలంగా తిరుమలాయపాలెం,కూసుమంచి , ఖమ్మం రూరల్ మండలాలకు కు నీరు ఇచ్చిన తుమ్మలను ఓడించి తాము తప్పు చేశామని ప్రజలు అభిప్రాయపడుతున్నారని వినికిడి …

నేడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి,.. పాలేరు టికెట్ కోసం తుమ్మల గట్టిపట్టుదలతో ఉన్నారు …సీఎం కేసీఆర్ తో సత్సంబంధాలు కలిగి ఉన్నారని సమాచారం …అయితే పాలేరు టికెట్ విషయంలో అధినేత నిర్ణయంకోసం కందాల ,తుమ్మల ,సిపిఎం లు ఎదురు చూస్తున్నాయి . తుమ్మలకు మరో చోట అకామిడేట్ చేసి పాలేరు ను కందాల కు ఇవ్వాలా ,తుమ్మలకు ఇవ్వాలా లేక ఇద్దరి మధ్య ఎలాగూ ఈసీటు సిపిఎం కోరుతున్నందున వారికీ కేటాయించాలా..? అనే ఆలోచనలో బీఆర్ యస్ అధినేత ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది… ఇదే సందర్భంలో సీట్ల విషయంలో కేసీఆర్ ఎటు తేల్చకపోవడంపై లెఫ్ట్ పార్టీలు గుర్రుగా ఉన్నాయి. సిపిఎం కు పాలేరు సీటు ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని ఆపార్టీ వర్గాలు అంటున్నాయి. బీఆర్ యస్ జిల్లా నాయకత్వం మాత్రం అలాంటిది ఏమిలేదని ఒకవేళ సిపిఎం , సిపిఐ కి సీట్లు కేటాయించాల్సి వస్తే భద్రాచలం , వైరా , మునుగోడు , మిర్యాలగూడెం ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు .

Related posts

కేసీఆర్ కోరుకున్నట్లుగానే మిమ్మల్ని అధ్యక్షుడిగా చేశారనే విమర్శలపై కిషన్‌రెడ్డి సమాధానం !

Drukpadam

వైఎస్ హయాంలో ఉచిత విద్యుత్ ఘనత కాంగ్రెస్ దే: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి…

Drukpadam

బీజేపీ నేతలు తాలిబన్లతో సమానం …కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య బీజేపీ పై ఘాటు వ్యాఖ్యలు!

Drukpadam

Leave a Comment