Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

మంత్రి పువ్వాడ అజయ్ సంపాదనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ధర్మ సందేహం ….

*మంత్రి పువ్వాడ అజయ్ సంపాదనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ధర్మ సందేహం ….
*కమ్యూనిస్ట్ కుటుంబంలో పుట్టిన అజయ్ ఇంత ఎలా సంపాదించాడని ప్రశ్న !
*సొంతపార్టీ వారు కూడా ఆయన వేధింపులు ఎక్కువయ్యాయని మొత్తుకుంటున్నారని వెల్లడి …
*దళితబంధు బీఆర్ఎస్ బంధుగా మారింది .. ఎమ్మెల్యేలకు కమిషన్లు
*కేసీఆర్ కుటుంబం పుట్టింది తెలంగాణ సమాజం కోసం కాదని వ్యాఖ్య
*ఖమ్మం సభకు అమిత్ షా వచ్చే అవకాశం ఉందని వెల్లడి…

రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఒక సామాన్య కమ్యూనిస్ట్ కుటుంబం నుంచి వచ్చారు …కానీ వేల కోట్ల సంపాదన ఎలా సాధ్యమైందని కేంద్రమంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం కిషన్ రెడ్డి ధర్మ సందేహం వెలిబుచ్చారు …అంతే కాకుండా ఖమ్మం జిల్లాలో అక్రమాలను ప్రశ్నిస్తున్న వారిపై మంత్రి పువ్వాడ అజయ్ వేధింపులకు పాల్పడుతున్నారని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గా భాద్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి ఖమ్మం వచ్చిన ఆయన కార్యకర్తల సమావేశంలోనూ ,మీడియా సమావేశంలో మాట్లాడతూ కేసీఆర్ పాలనపై ధ్వజమెత్తారు . అనేక మంది ప్రాణత్యాగం తో ఏర్పడిన తెలంగాణ చివరకు ఒక కుటుంబానికి పరిమితమందని దుయ్యబట్టారు .రాష్ట్రాన్ని అప్పుడలా కుప్పగా మార్చారని , సంక్షేమ పాలనా అంటూ సంక్షోభం దిశగా పాలనా సాగుతుందని విమర్శలు గుప్పించారు . పోలీసు అధికారులు, వారి కనుసన్నల్లో పని చేసేలా కేసీఆర్ కుటుంబం చేసుకుందని కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు .

తెలంగాణలో దళితబంధు పథకం బీఆర్ఎస్ బంధుగా మారిందని రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి విమర్శించారు. దళితబంధులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కమిషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. మాఫియా మాదిరి బీఆర్ఎస్ నేతలు దోపిడీలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బయ్యారంలో స్టీల్ ఫ్యాకర్టీ కడతామని కేసీఆర్ కుటుంబసభ్యులు ఉత్తరకుమార ప్రగల్భాలు పలికారని, ఇప్పటి వరకు ఫ్యాక్టరీ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. మీరు పుట్టింది తెలంగాణ సమాజం కోసం కాదని… మీ కుటుంబం కోసం మాత్రమేనని మండిపడ్డారు.

ఈ నెల 27న ఖమ్మంలో నిర్వహించే సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వచ్చే అవకాశం ఉందని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటేనని అన్నారు.సమావేశంలో బీజేపీ సీనియర్ నేత తమిళనాడు బీజేపీ కో -ఇంచార్జి డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి , జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ , కిసాన్ సెల్ అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ..

Related posts

కేసీఆర్ అధికారంలోకి వచ్చాక… వారి కుటుంబం మాత్రమే బాగుపడింది: రేవంత్ రెడ్డి

Ram Narayana

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరా , ఇల్లందు బీఆర్ యస్ అభ్యర్థుల మార్పు ….?

Ram Narayana

 కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ జీవిత ప్రయాణం…!

Ram Narayana

Leave a Comment