Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

విజయవాడలో హయత్ ప్లేస్ హోటల్ ను ప్రారంభించిన జగన్!

-విజయవాడలో హయత్ ప్లేస్ హోటల్ ను ప్రారంభించిన జగన్!
-టూరిజంకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నామన్న జగన్
-ప్రపంచ పర్యాటకరంగంలో ఏపీకి ప్రత్యేకమైన స్థానం ఉండాలని ఆకాంక్ష
-హోటల్స్ చైన్ రాష్ట్రమంతా విస్తరించాలన్న సీఎం

విజయవాడలో నూతనంగా నిర్మించిన హయత్ ప్లేస్ హోటల్ ను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ పర్యాటక రంగానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని చెప్పారు. టూరిజం పాలసీలో భాగంగా హయత్ ప్లేస్ కు ప్రభుత్వం అనుమతిని ఇచ్చిందని తెలిపారు. కేవలం విజయవాడలోనే కాకుండా ఇలాంటి హోటల్స్ ఏపీ అంతటా రావాలని చెప్పారు. ప్రపంచ పర్యాటక రంగంలో ఏపీకి ప్రత్యేకమైన స్థానం ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రానికి పర్యాటకులను ఆకర్షించేలా టూరిజం పాలసీని తీసుకొచ్చామని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పలు ప్రముఖ సంస్థలను ఆహ్వానించామని చెప్పారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలను అందిస్తున్నామని తెలిపారు. హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, రోజా, గుడివాడ అమర్ నాథ్, తానేటి వనిత పాల్గొన్నారు.

Related posts

కేసీఆర్ తోనే తన ప్రయాణం : మాజీ మంత్రి తుమ్మల…

Drukpadam

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఉప ఎన్నికల పోలింగ్

Drukpadam

Nicole Kidman on Aging and Her Favorite Skin Care Products

Drukpadam

Leave a Comment