Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఎన్నికల వేళ ప్రత్యర్థి పార్టీ నేతలతో కాపీ, చాయ్ ముచ్చట్లు కట్టిపెట్టండి ..

ఎన్నికల వేళ ప్రత్యర్థి పార్టీ నేతలతో కాపీ, చాయ్ ముచ్చట్లు కట్టిపెట్టండి ..
-పార్టీని గెలిపించాలని కసితో రంగంలోకి దిగండి ,,,
-చిన్న చిన్న తగాదాలను పక్కన పెట్టండి
-కాంగ్రెస్ నేతలకు తలంటిన అధిష్టానం …
-ప్రతి కార్యకర్త సైనికుడిగా పనిచేయాలి …కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలి
-ఎంతటివారైనా గీత దాటితే వేటు తప్పదు …
-కచ్చితంగా సర్వేల ఆధారంగానే టికెట్స్
-ఇప్పటికే తెలంగాణపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం
-రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించనున్న రాహుల్ , ప్రియాంక
-సోనియా సైతం కొన్ని సభలకు హాజరయ్యే అవకాశం
-ప్రియాంక గాంధీ , డీకే శివకుమార్ లకు పర్వేక్షణ భాద్యత …!

ఎన్నికల వేళ ప్రత్యర్థి పార్టీ నేతలతో కాపీ ,చాయ్ ముచ్చట్లు కట్టి పెట్టండి …పార్టీని గెలిపించాలని కసితో రంగంలోకి దిగండి …చిన్న చిన్న తగాదాలు ఉంటె పక్కన పెట్టండి …అని కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ కాంగ్రెస్ నేతలకు తలంటినట్లు సమాచారం….ప్రతి నాయకుడు , కార్యకర్త అధికారంలోకి వచ్చేందుకు సైనికుడిలా పనిచేయాలి …మానుంచి ఎలాంటి సహాయం కావాలో చెప్పండి…అంతే కానీ పితుర్లు ,ఫిర్యాదులతో రాకండి …పార్టీని బ్రతికించి ,మీరు బతకండి ..తేడాలు వస్తే ఎంతటి వారైనా చర్యలు తెప్పవాని స్పష్టం చేసింది…

తెలంగాణ శాసనసభకు మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగ నున్నాయి…ఇందుకోసం ఎన్నికల సంఘం కూడా కసరత్తు ప్రారంభించింది. అధికార బీఆర్ యస్ , కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ , తెలంగాణాలో అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ లమధ్య రసవత్తర పోరుకు రంగం సిద్దమవుతుంది. అన్ని హంగులు కలిగి ఉన్న అధికార బీఆర్ యస్ నేత కేసీఆర్ అభ్యర్థుల ఎంపిక పై తలమునకలై ఉన్నారు …బీజేపీ ఎస్సీ , ఎస్టీ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకుంది … తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ రంగంలోకి దిగుతుంది. ఇటీవల కర్ణాటక ఎన్నికల జోష్ లో ఉన్న కాంగ్రెస్ నేతలు దాన్ని కొనసాగించాలని చూస్తున్నారు … , గతంలో అమలు చేసిన పథకాలు , ఇందిరమ్మ ఇళ్ళు, ఇరిగేషన్ ప్రాజక్టులు ,ఉపాధి హామీ పథకాలు , పావలా వడ్డీ , రైతుల రుణమాఫీ యువతకు ఉద్యోగ ,ఉపాధి , రైతులకు ఉచిత విద్యుత్ లాంటి పథకాలను , వృద్దులు , వికలాంగులకు , వితంతువు పెన్షన్ లు రైతులకు రెండు లక్షల రుణమాఫీ తమ ప్రచారాస్త్రాలుగా కాదనా రంగంలోకి దిగనున్నారు . ఎన్నికల మ్యానిఫెస్టోలో పై అంశాలతో పాటు యువతకు ఉపాధి ,ఉద్యోగ అవకాశాలపై ఫోకస్ పెట్టనున్నారు .ఇంతవరకు బాగానే ఉన్న కాంగ్రెస్ లో బహునాయకత్వం , సీనియర్ లు, జూనియర్ల మధ్య విభేదాలు తలనొప్పిగా మారాయి…. దీంతో కాంగ్రెస్ కు ప్రజల్లో సానుభూతి ఉన్నప్పటికీ …నాయకుల్లో అనైక్యత పెద్ద శాపంగా మారె అవకాశాలు కొట్టి పారేయలేనివే .

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి జంప్ చేయడంతో ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. ఒక వేళ రేపు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్
అభ్యర్థులను గెలిపించినా పార్టీ మారరనే గ్యారంటీ ఏమిటనే అభిప్రాయాలను ఓటర్లు వెలిబుచ్చుతున్నారు . అందువల్ల కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థుల ఎంపిక సందర్భంగా ఆచితూచి అడుగులు వేసేందుకు సిద్ధమైంది . ..కాంగ్రెస్ కు ఎట్టి పరిస్థితుల్లో అధికారం దక్కకుండా చేయాలనీ బీఆర్ యస్ కన్నా కూడా బీజేపీ అన్ని రకాల అస్త్రశస్త్రాలను ఉపయోగించే పనిలో ఉంది. ఇందుకు కారణం లేకపోలేదు … ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో జోష్ పెరిగింది… దేశంలో కాంగ్రెస్ పని అయిపోయిందని , వెంటిలేటర్ పై ఉందని ప్రచారం జరుగుతున్న క్లిష్ట సమయంలో అంతకు ముందు హిమాచల్ రాష్ట్రం ,తాజాగా కర్ణాటక ఎన్నికలు కాంగ్రెస్ కు ఆక్సిజెన్ ఇచ్చినంత పనిచేశాయి …కర్ణాటక ఎన్నికల తర్వాత పక్కనే ఉన్న తెలంగాణాలో కాంగ్రెస్ కు అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని రాజకీయ పండితులు సైతం అంగీకరిస్తున్నారు . అయితే కాంగ్రెస్ లో ఉన్న అంతర్గత విభేదాలను పరిష్కరించుకొని ముందుకు పొతే బీఆర్ యస్ కు కాంగ్రెస్ కు మధ్యనే పోటీ ఉంటుంది. ఇది పసిగట్టిన అధికార బీఆర్ యస్ , బీజేపీ లు కాంగ్రెస్ లో ఉన్న గ్రూప్ తగాదాలను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని ఎత్తులు వేస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఈసారి తెలంగాణలో అధికారం కోసం పకడ్బందీ వ్యూహాలు అమలుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లకు తెలంగాణ ఎన్నికల పర్వేక్షణ భాద్యతలు అప్పగించింది…

కాంగ్రెస్ లో ఉన్న గ్రూప్ తగాదాలు , జిల్లాల వారీగా అభ్యర్థుల ఎంపిక ,
నియోజకవర్గాల వారీగా గెలుపు అవకాశాలు ఉన్న అభ్యర్థులను వారు సునిశితంగా పరిశీలించనున్నట్లు సమాచారం . ఎవరైనా పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా వ్యవహరిస్తే, వారు ఎంతటివారైనా చర్యలు తప్పవని ఒక కాంగ్రెస్ సీనియర్ నేత పేర్కొనడం గమనార్హం . అయితే కొంతమంది నేతలు అధికార పార్టీతో రహస్య ఒప్పందాలు , రాసుకు పూసుకు తిరగటం ,కాపీ , చాయ్ ముచ్చట్లపై కాంగ్రెస్ అధిష్టానం అరా తీస్తుంది .అందుకే ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనేతలతో సమావేశం అయ్యేందుకు అధిష్టానం ప్రత్యేక దూతగా వచ్చిన కేసి వేణుగోపాల్ తమ ఎదుటే వాదులాడుకుంటున్న నేతలపై అసహనం వ్యక్తం చేశారు . అంతే కాకుండా ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీరే మంత్రులు అవుతారు గానీ మేమొచ్చి కాముకదా అని ఒకింత కఠువుగానే మాట్లాడటం ఆపార్టీ వైఖరిని తెలియజేస్తుంది …

ఎప్పటికప్పుడు నాయకుల పనితీరు వారి మధ్య ఐక్యత సాధించాలనే లక్ష్యంగా పావులు కదుపుతుంది… ఇందుకు ముఖ్యనేతలతో కలిసి బస్సు యాత్ర చేపట్టాలని నిర్ణయించారు . రాష్ట్ర పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు మరో ఇద్దరు కీలక నేతలను రంగంలోకి దించింది కాంగ్రెస్ అధిష్టానం . పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ లకు బాధ్యతలను అప్పజెప్పింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహాలను రచించడం, ప్రచారం, ఇతర ప్రధాన బాధ్యతలను వీరికి అప్పగించింది. తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించిన కీలక నిర్ణయాలను వీరు తీసుకోనున్నట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం…. ప్రియాంక గాంధీ రాష్ట్రంలో విస్తృత పర్యటనలు చేస్తారు …. రాహుల్ గాంధీకూడా రాజస్థాన్ , మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ లతోపాటు తెలంగాణ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. సోనియా గాంధీ సైతం తెలంగాణాలో కొన్ని సభల్లో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం …

Related posts

మంద కృష్ణ మాదిగ అప్పుడే ప్రధాని మోదీని కలిశారు: ఎస్సీ వర్గీకరణపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Ram Narayana

డిప్యూటీ సీఎం భట్టిపై విహెచ్ కు కోపం వచ్చింది …

Ram Narayana

కాంగ్రెస్ నేతలకు మంత్రి కేటీఆర్ సవాల్

Ram Narayana

Leave a Comment