ఐ ఓట్ ఫర్ షోర్ కార్యక్రమంలో పాల్గొన్న బీపీ నాయక్
కచ్చితంగా ఓటేయండి దేశాన్ని నడిపించండి
ఓటు హక్కు వినియోగించుకోవడం దేశభక్తితో సమానం : బీపీ నాయక్

భారత ఎన్నికల సంఘం పిలుపుమేరకు ఓటింగ్ పైన అవగాహన ఇస్తూ చేపట్టిన ఐ ఓట్ ఫర్ షోర్ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా జాయింట్ కలెక్టర్ మధుసూదన్ నాయక్, ఎసిపి రహమాన్ మిగతా ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్న రాష్ట్ర ఐటీ సెల్ కన్వీనర్ వైరా అసెంబ్లీ బిజెపి నేత బీపీ నాయక్. 2500 మంది బాలబాలికలతో జాతీయ జెండాలతో ఏర్పాటు చేసిన 5కే రన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 75 సంవత్సరాలుగా భారతదేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా నిలుపుతున్న ఏకైక కారణం ఓటు ద్వారా మన నాయకుల్ని మనం ఎన్నుకోవడమే. అందుకు రాబోయే ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకొని దేశాన్ని సమర్థవంతంగా పాలించే నాయకులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీపీ నాయక్ మాట్లాడుతూ ఓటును ఒకరోజు పండగలా కాకుండా ప్రజలకు భరోసానిచ్చే, యువతకు బంగారు భవిష్యత్తును ఇచ్చే ఆయుధంగా ఉపయోగించాలని విద్యార్థిని విద్యార్థులను కోరారు. మన ఓటు మనం వినియోగించుకోవడం కూడా ఈ దేశం పట్ల దేశభక్తిని చాటడమే అని ఆయన అన్నారు.


Save or share this story as a newspaper-style Epaper Clip: