- లోయలో పడిన సైనిక వాహనం
- లేహ్ జిల్లాలోని ఖేరీ పట్టణానికి సమీపంలో ఘటన
- సైనిక బలగాల కారు గారిసన్ నుంచి ఖేరీ వెళుతుండగా ప్రమాదం
లడఖ్ లో నేడు ఘోర ప్రమాదం సంభవించింది. ఓ సైనిక వాహనం లోయలో పడిన ఘటనలో 9 మంది ఆర్మీ జవాన్లు మృతి చెందారు. మరికొందరు జవాన్లకు గాయాలయ్యాయి. లేహ్ జిల్లాలోని ఖేరీ పట్టణానికి సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
ఇవాళ సాయంత్రం 6.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సైనిక బలగాల కారు గారిసన్ ప్రాంతం నుంచి ఖేరీ తరలి వెళుతుండగా అదుపుతప్పి, లోతైన లోయలోకి పడిపోయిందని అధికారులు వెల్లడించారు.