Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

బీఆర్ యస్ వైఖరిపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని తీవ్ర అసంతృప్తి …

మునుగోడు ఉపఎన్నికప్పుడు బీఆర్ఎస్సే మా వద్దకు వచ్చి మద్దతు అడిగింది: సీపీఐ నేత కూనంనేని

  • పొత్తుకు సంబంధించిన బంతి బీఆర్ఎస్ కోర్టులో ఉందన్న కూనంనేని
  • ఎన్టీఆర్, వైఎస్సార్, చంద్రబాబు కమ్యూనిస్ట్ పార్టీలకు గౌరవం ఇచ్చారని వ్యాఖ్య
  • మునుగోడు ఉప ఎన్నికల్లో మేం వారి వద్దకు వెళ్లలేదని వెల్లడి

తెలంగాణలో అధికార బీఆర్ఎస్, సీపీఐ మధ్య పొత్తుపై ప్రతిష్ఠంభన కనిపిస్తోంది. పొత్తులో భాగంగా నాలుగు స్థానాలు ఇవ్వాలని సీపీఐ కోరుతోంది. ఈ ప్రతిపాదనపై అధికార పార్టీ సానుకూలంగా స్పందించడం లేదని తెలుస్తోంది. తాము బలంగా ఉన్న పలు నియోజకవర్గాలవిషయంలో సీపీఐ పట్టుబడుతోంది. 

ఈ క్రమంలో సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ… పొత్తుకు సంబంధించిన బంతి ప్రస్తుతం బీఆర్ఎస్ కోర్టులో ఉందన్నారు. పొత్తులపై తేల్చాల్సింది బీఆర్ఎస్ అన్నారు. తొలుత బీఆర్ఎస్ లిస్ట్ అంటున్నారని, ఆ తర్వాత తమతో పొత్తుపై చర్చలు జరుపుతామని చెబుతున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబునాయుడు వంటి వారు కమ్యూనిస్ట్ పార్టీలకు మంచి గౌరవం ఇచ్చారన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తమంతట తాము వెళ్లి మద్దతు ఇస్తామని చెప్పలేదని, బీఆర్ఎస్ వాళ్లు వచ్చి అడిగితేనే మద్దతు ఇచ్చామన్నారు.

Related posts

ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలు ఉండవు: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Ram Narayana

రేవంత్ రెడ్డి బీజేపీతో కలిసి పోయారు …కేటీఆర్

Ram Narayana

బీఆర్ యస్ కు బై …కాంగ్రెస్ కు జైఅన్న బీఆర్ యస్ ఎమ్మెల్యే మైనంపల్లి…!

Ram Narayana

Leave a Comment