Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

బీఆర్ యస్ పై భగ్గుమన్న కామ్రేడ్స్ …కేసీఆర్ మోసకారి అని అభియోగం…

బీఆర్ యస్ పై భగ్గుమన్న కామ్రేడ్స్ …కేసీఆర్ మోసకారి అని అభియోగం…
కీం కర్తవ్యం అనేదానిపై కమ్యూనిస్టుల ఆతర్మధనం …
రెండు పార్టీలు కలిసి పోటీచేసేందుకు అంగీకారం
కాంగ్రెస్ తో జతకట్టేందుకు ప్రయత్నాలు

బీఆర్ యస్ తో కలిసి పోటీచేస్తామని ఎన్నికల్లో వారితోనే కలసి తమ ప్రయాణమని గత ఆరునెలలుగా చెపుతున్న కమ్యూనిస్టులకు కేసీఆర్ షాక్ ఇచ్చారు .. కమ్యూనిస్టులతో పొత్తు గిత్తూ జంతా నహి అంటు కేసీఆర్ అభ్యర్థులను ఏకపక్షంగా ప్రకటించడం మింగుడుపడని అంశంగా మారింది. చివరికి పార్టీలో కూడా తమ క్యాడర్ కు ఏమి చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది.. మునుగోడు ఎన్నికల తర్వాత వామపక్షాలతో కలుద్దాం ,కలిసి పోటీచేద్దాం అంటూనే కేసీఆర్ మోసం చేయడం పై కామ్రేడ్స్ భగ్గుమంటున్నారు …నమ్మించి గొంతు కోయడమంటే ఇదేనని వారు వాపోతున్నారు .మంగళవారం సిపిఎం , సిపిఐ రాష్ట్ర ముఖ్యనేతల సమావేశాలు వేరు వేరుగా వారి,వారి పార్టీ కార్యాలయాల్లో జరిగాయి. ఈసందర్భంగా పార్టీ నాయకత్వ వైఖరిపై గట్టిగానే చర్చలు జరిగినట్లు సమాచారం …కింద క్యాడర్ బీఆర్ యస్ తో పొత్తు వద్దని చెప్పినప్పటికీ బీఆర్ యస్ తోనే ఎన్నికల్లో పయనిస్తామని చెప్పడం కొన్ని సందర్భాల్లో వారికన్నా ఎక్కువగా స్పందించడంపై పార్టీలో చర్చనీయాంశంగా మారింది. చివరకు కేసీఆర్ జిత్తులమారి వ్యవహారాన్ని పసిగట్టలేక పోయామని కమ్యూనిస్టులు అంగీకరిస్తున్నారు .

చివరకు రెండు పార్టీల నేతలు జరిపిన సమావేశంలో బలమున్న నియోజకవర్గాల్లో రెండు పార్టీలు కలిసి పోటీచేయాలని నిర్ణయానికి వచ్చారు . ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ,సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు లు పాల్గొన్నారు . బీఆర్ యస్ తో బీజేపీకి సంబంధాలపై అనుమానాలు వ్యక్తం చేశారు . కేసీఆర్ నమ్మకస్తుడు కాదనే నిశ్చతాభిప్రాయానికి వచ్చారు . ఎట్టి పరిస్థితిల్లో బీఆర్ యస్ ఎలాంటి స్నేహం ఉండకూడదని నిర్ణయించుకున్నారు . రాజకీయాల్లో అనేకం చూశాం కానీ నమ్మకంగా మాటలు చెప్పి ద్రోహం చేయడం కేసీఆర్ దగ్గరే చూశామని అంటున్నారు .

Related posts

బీఆర్ఎస్‌‍ను వీడుతున్న వారిపై జాతీయ ఛానల్‌తో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు…

Ram Narayana

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనంలో బీఆర్ యస్ కొట్టుకొని పోవడం ఖాయం..పొంగులేటి,తుమ్మల ,సిపిఐ నారాయణ …

Ram Narayana

కాంగ్రెస్ పార్టీలో చేరిన కె.కేశవరావు…

Ram Narayana

Leave a Comment