అర్హులైన జర్నలిస్టుందరికీ ఇళ్లస్థలాలు ఇవ్వాలి…
సెప్టెంబర్ మొదటి వారంలో జిల్లా కార్యవర్గ సమావేశం
ఐజెయులో చేరనున్న 150 మంది జర్నలిస్టులు
సిఎం అనాలోచిత వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం
టియూడబ్ల్యూజె (ఐజెయు) రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.రాం నారాయుణ
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అర్హులైన జర్నలిస్టుందరికీ ఇళ్లు , ఇళ్లస్థలాలు ఇవ్వాలని టియూడబ్ల్యూజె (ఐజెయు) రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.రాం నారాయణ డిమాండ్ చేశారు . ఖమ్మంలోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల పక్షాన నికరంగా నిలబడే ఐజెయులో ఇటీవల పలువురు సీనియర్ జర్నలిస్టులు చేరారని , వారందరికీ స్వాగతం పలుకుతున్నామని పేర్కొన్నారు . సెప్టెంబర్ మొదటి వారంలో జరిగే జిల్లా కార్యవర్గ విస్త్రత స్థాయి సమావేశంలో సుమారు 150 మంది జర్నలిస్టులు చేరనున్నట్లు తెలిపారు . వారందరికీ స్వాగతం పలుకుతున్నావున్నారు. సంఘం ఏర్పడిన నాటి నుండి నేటి వరకూ జర్నలిస్టుల సవుస్యలపై ఐజెయూ పోరాడి పరిష్కరించామని అన్నారు . ఖమ్మంలో ఇళ్లస్థలాలు ఇచ్చేందుకు కృషి చేసిన మంత్రి పువ్వాడకు ధన్యవాదాలు తెలిపారు . ఇదే విధంగా ఉమ్మడి జిల్లాలోని అర్హులైన వారందరికీ ఇళ్లస్థలాలు ఇవ్వాలని ఇప్పటికే ఐజెయూ పోరాడిందని , రాబోయే కాలంలోనూ పోరాడుతుందని తెలిపారు . అన్ని నియోజకవర్గాల్లోనూ తమ సంఘం ప్రతినిధులు స్థానిక ఎంఎల్‌ఏలను కలిసి వినతిపత్రాలు ఇచ్చినట్లు తెలిపారు . అక్రిడేషన్లు , హెల్త్‌కార్డులు తదితర సౌకర్యాలన్నీ తమ సంఘం పోరాటంతోనే విలేకర్లకు అందాయున్నారు . ఖమ్మంలో ప్రెస్‌క్లబ్ నిర్మాణం తమ సంఘం కృషి ఫలితంగానే ఏర్పడిందన్నారు . విశాలైమెన ప్రెస్‌క్లబ్ నిర్మాణం కోసం రాబోయే కాలంలో ఐజెయు కృషి చేస్తుందన్నారు . ఈ నెల 20న హైదరాబాద్‌లోని దేశోద్ధారక భవన్‌లో జరిగిన సమావేశంలో తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేుషన్ ఏర్పడిందని , ఈ సందర్భంగా వేసిన కన్వీనింగ్ కమిటీలో మన జిల్లా నుండి సీనియర్ జర్నలిస్టులు ఎన్.వెంకట్రావ్‌కు , ఖదీర్‌కు చోటు లభించిందని పేర్కొన్నారు . రాబోయే కాలంలో పూర్తి కమిటీని వేసేందుకు రాష్ట్ర కమిటీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు . జర్నలిస్టుల పట్ల సిఎం కేసీఆర్ చేసిన అనాలోచిత వ్యాఖ్యలను ఖండించారు . ఈ సందర్భంగా ఐజెయులో చేరిన సీనియర్ జర్నలిస్టులు ఖదీర్ , నాగేందర్‌రెడ్డి , సాగర్ , కెవి , యాకేష్ , సంతోష్ , పెండ్ర అంజయ్యలను అభినందించారు .
అనంతరం హిందూ ఫొటోగ్రాఫర్ గోటు నాగేశ్వరరావుకు ఐజెయూ సభ్యత్వమును అందించారు . ఈ కార్యక్రమంలో టియూడబ్ల్యూజె(ఐజెయు) జాతీయ కౌన్సిల్ సభ్యులు సామినేని మురారి , రాష్ట్ర నాయకులు నర్వనేని వెంకట్రావ్ , జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వనం వెంకటేశ్వర్లు , ఏనుగు వెంకటేశ్వరరావు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆవుల శ్రీనివాసరావు , కనకం సైదులు , యూనియన్ నగర కార్యదర్శి చెరుకుపల్లి శ్రీనివాసరావు , కోశాధికారి రాయుల బసవేశ్వరరావు , ప్రెస్‌క్లబ్ కార్యదర్శి కూరాకుల గోపి , కోశాధికారి నామా పురుషోత్తం , జిల్లా నాయుకులు జనార్దనాచారి , వేణు , మధులత , మేడి రవేుష్ , పి. సత్యనారాయణ , కళ్యాణ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు .