హన్మకొండలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకోసం బీజేపీ పోరాటం రక్తసిక్తం …
హన్మకొండలో చలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వెళ్లిన బీజేపీ కార్యకర్తలు
బారికేడ్లు పెట్టి అడ్డగించిన పోలీసులు
అక్కడకు చేరుకున్న బీఆర్ యస్ కార్యకర్తలు
పరస్పరం రాళ్లు , కర్రలతో దాడులు …
బీఆర్ యస్ కార్యకర్తల దాడిలో బీజేపీ కార్యకర్తలకు గాయాలు
రాష్ట్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు కట్టిస్తామని చెప్పి మాటతప్పిన ప్రభుత్వ ఎమ్మెల్యేలను నిలదీసేందుకు బీజేపీ ఇచ్చిన పిలుపులో భాగంగా ,హన్మకొండ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ క్యాంపు కార్యాలన్నీ బీజేపీ కార్యకర్తలు ముట్టడించే ప్రయత్నం చేశారు .దాన్ని స్థానిక పోలీసులు బరికెడ్ల ఏర్పాటు చేసి అడ్డుకున్నారు .ఒక పక్క బీజేపీ ,మరో పక్క బీఆర్ యస్ కార్యకర్తలు మోహరించారు . ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు . కర్రలతో దాడులకు ప్రయత్నాలు జరిగాయి. పోలీసులు లేకపోతె పెద్ద ప్రమాదం జరిగేదని తెలుస్తుంది.
బీఆర్ యస్ కార్యకర్తలు జరిపిన దాడిలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి తల పగిలింది .మరో ముగ్గురు కార్యకర్తలకు కూడా గాయాలయ్యాయి…పోలీసులు ఇరు వర్గాలను చెదర గొట్టారు .కొందరిని అదుపులోకి తీసుకున్నారు .ఘటనకు భాద్యులపై చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు పేర్కొన్నారు .
హన్మకొండ దాడిని ఖండించిన మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ తమిళనాడు కో-ఇంచార్జీ పొంగులేటి సుధాకర్ రెడ్డి.
రాళ్ళు రువ్వటం పై సీరియస్, తలలు పగిలిన విజువల్స్ చూసి ఆవేదన చెందినట్లు సుధాకర్ రెడ్డి వెల్లడి .తమ పార్టీ కార్యకర్తలు శాంతియుతంగా నిరసన చేస్తుంటే రాళ్ళు రువ్వడం దారుణమని ఆవేదన …మా రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి పై రాళ్ళు విసిరారని అన్నారు . జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ను అక్రమంగా అరెస్ట్ చేశారని పేర్కొన్నారు .రాకేష్ రెడ్డిని టార్గెట్ గా చేసి విసిరిన రాయి త్రుటిలో తప్పిందని లేకపోతె పెద్ద ప్రమాదం జరిగేదని అన్నారు . తమకు అధికారం రాదని గ్రహించిన బీఆర్ యస్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుందని అన్నారు . తమ కార్యకర్తల తలలు పగిలి రక్తాలు కారేలా కర్రలు, రాళ్లతో దాడి చేస్తున్న వారిని పోలీసులు నివారించలేదని ఆరోపించారు . గతంలో తెలంగాణ ఎన్నడైనా ఇలాంటి పరిస్థితి లేదని పొంగులేటి అన్నారు ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ప్రాథమిక హక్కు అని కేసీఆర్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే లు నియోజకవర్గాలను వాళ్ల జాగిర్ లెక్క ఫీలవుతున్నారని ధ్వజమెత్తారు . దాడిలో పాల్గొన్న బీఆర్ యస్ కార్యకర్తలను, గూండాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు .