Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

జై జై తుమ్మల , జైయహో తుమ్మలతో మార్మోగిన ఖమ్మం సరిహద్దు ప్రాంతం … టోల్ ప్లాజా వద్ద జనసంద్రం … . ఖమ్మం సరిహద్దుల్లో ఘనస్వాగతం…!

పరాభవానికి ప్రతీకారం …తుమ్మలకు నాయకంగూడెం టోల్ ప్లాజా వద్ద గ్రాండ్ వెల్ కం …
తుమ్మలను కేసీఆర్ గెంటివేస్తే అక్కున చేర్చుకున్న ప్రజలు
1000 కి పైగా కార్లతో భారీ ర్యాలీ ..అభిమానుల సందడితో కిక్కిరిసిన టోల్ ప్లాజా రోడ్
ఖమ్మం సరిహద్దుల్లో నాయకంగూడెం టోల్ ప్లాజా వద్ద అభిమాననేతకు ఆత్మీయ స్వాగతం పలికిన వేలాది మంది ప్రజలు
మీవెంట మేమున్నామని తుమ్మలకు భరోసా
తనకు స్వాగతం పలికేందుకు తరలివచ్చిన వేలాది మంది ప్రజలకు ముకుళిత హస్తాలతో కృతజ్ఞతలు తెలిపిన తుమ్మల
ఒక సందర్భంలో భావోద్యేనికి గురైన తుమ్మల
హైదరాబాద్‌ నుంచి ఖమ్మం బయల్దేరే ముందు భావోద్వేగం
అనుచరులను చూసి కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి
మండుటెండలో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలిన తుమ్మల
ఓపెన్ టాప్ వాహనంలో నాయకన్ గూడెం , పాలేరు ,కూసుమంచి జీళ్లచెరువు తల్లంపాడు,పొన్నేకల్ ,మద్దులపల్లి , తెల్దారుపల్లి క్రాస్ రోడ్ , వరంగల్ క్రాస్ రోడ్ , మీదగా ఖమ్మంకు

ఇటీవల కేసీఆర్ ప్రకటించిన లిస్టులో తాను ఆశించిన పాలేరు టికెట్ ప్రకటించకపోవడంతో . పరాభవానికి గురైన మాజీమంత్రి తుమ్మల ప్రతీకారేచ్చగా అన్నట్లు నేడు ఖమ్మంజిల్లాకు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు ..హైద్రాబాద్ లోని తన నివాసం నుంచి భారీవాహనాలతో బయలుదేరిన తుమ్మల మార్గమధ్యలో వెలిమినేడు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించారు . అక్కడ నుంచి బయలుదేరి ఖమ్మం సరిహద్దుల్లోని నాయకునిగూడెం టోల్ ప్లాజా వద్దకు చేరుకున్నారు . నాయకన్ గూడెం వద్ద ఖమ్మం నుంచి 1000 కి పైగా కార్లతో అక్కడకు చేరుకున్న వేలాది మంది అభిమానులు ఆయనకు గ్రాండ్ వెల్ కం చెప్పారు .ఒక సందర్భంలో వేలాదిగాతనకోసం వచ్చిన ప్రజలను చూసి తుమ్మల భావోద్యేనికి గురైయ్యారు .ప్రజలు తనపై చూపుతున్న అభిమానానికి కన్నీళ్లు పెట్టుకున్నారు . ఆయన్ను చూడగానే అభిమాలుకేరింతలు కొట్టారు ..పూలజల్లు కురిపించారు …శాలువాలతో సత్కరించారు .జై తుమ్మల ,జై జై తుమ్మల అంటూ నినాదాలతో ఆప్రాంతమంతా మారుమోగింది…టోల్ ప్లాజా ప్రాంతం అంతా జనసంద్రంగా మారింది ..

తుమ్మల రాకకోసం ఉదయం 10 గంటల నుంచే నాయకన్ గూడెం టోల్ ప్లాజా వద్దకు ప్రజలు చేరుకోవడం ప్రారంభమైంది .పదులు , వందలు , వేలమంది అక్కడకు చేరుకున్నారు .అక్కడ టెంట్లు వేసి వచ్చినవారికి భోజనాలు కూడా ఏర్పాటు చేశారు ..తుమ్మల మధ్యాహం 1 .15 గంటలకు చేరుకున్నారు . వచ్చినవారంతా తుమ్మల రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సిందేనని అభిప్రాయాన్ని వెలిబుచ్చారు . తుమ్మల వెంట మేముంటామనే భరోసా కల్పించారు . ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్న తమ మద్దతు ఉంటుందని అభిమానులు వెల్లడించారు . ఆయన పాలేరు లేదా ఖమ్మం లో ఎక్కడ నుంచి పోటీచేసిన గెలిపించి తీరుతామని చెప్పడం గమనార్హం …

టోల్ ప్లాజా నుంచి ఓపెన్ టాప్ వాహనంలో తుమ్మల తనకోసం వచ్చిన ప్రతివారికి ముకుళిత హస్తాలతో కృతజ్ఞతలు తెలిపారు ..చిరునవ్వుతో అందరిని పలకరించారు . నాయకన్ గూడెం , పాలేరు ,కూసుమంచి జీళ్లచెరువు తల్లంపాడు,పొన్నేకల్ ,మద్దులపల్లి , తెల్దారుపల్లి క్రాస్ రోడ్ , వరంగల్ క్రాస్ రోడ్ , కోదాడ క్రాస్ మీదగా ఖమ్మంలోని గుళ్లగూడెం రోడ్ లోగల తన నివాసానికి చేరుకున్నారు .ఆయన కాన్వాయ్ వెంట వేలాది కార్లు వచ్చాయి. గతంలో అనేక మందికి ఖమ్మం జిల్లా సరిహద్దుల్లో అనేక మంది నేతలకు స్వాగతం పలికినప్పటికీ ఇంతపెద్ద కాన్వాయ్ ఎప్పడు చూడలేదనే పలువురు పేర్కొన్నారు .

తుమ్మల ఫోటో తో జెండాలు ….దానితో పాటు కనపడిన కాంగ్రెస్ జెండా …

తుమ్మల రాక సందర్భంగా వేలాది మంది జిల్లా సరిహద్దులవరకు చేరుకోవడంతోపాటు , ప్రత్యేకంగా ప్రింట్ చేయించిన ఆయన ఫొటోతో ఉన్న భారీ తెల్ల జెండాలు దర్శనం ఇచ్చాయి. దానిపై జై తుమ్మల జై జై తుమ్మల అని ఉంది … ఒకే ఒక కాంగ్రెస్ జెండాతోపాటు , తుమ్మల ఫోటో జెండా ఒక అభిమాని పట్టుకొని తిరగటం ప్రత్యేక ఆకర్షణగా కనిపించింది… ఎక్కడా బీఆర్ఎస్, కేసీఆర్ జెండాలు లేకుండా, కేవలం తుమ్మల ఫొటోలు, ఫ్లెక్సీలనే పెట్టారు. నాయకన్ గూడెం నుంచి ఖమ్మం వరకు ర్యాలీ చేపట్టారు.

మరోవైపు కాంగ్రెస్ నుంచి ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావుకు ఆహ్వానం అందింది. దీంతో ఆయన ఆ పార్టీలోకి వెళ్తారా? లేక ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. తన అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించి, నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయని తుమ్మల.. ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. తుమ్మల కోసం వచ్చిన పలువురిని పలకరించగా ఆయన కాంగ్రెసులోకి వెళ్లాలని పాలేరు లేదా ఖమ్మం లో ఎదో ఒక సీటు నుంచి పోటీచేయాలని అభిప్రాయాన్ని వెలిబుచ్చారు …ఎవరు కూడా బీజేపీకి వెళ్లాలని కోరుకోలేదు .లేదా స్వతంత్రంగా పోటీచేయాలని అనలేదు …కేసీఆర్ చెప్పే మాయమాటలు నమ్మవద్దని , ఆయన అనేక వాగ్దానాలు చేస్తారని గతంలో అనేకమందికి ఇచ్చిన వాగ్దానాలు ఈసందర్భంగా గుర్తు చేస్తున్నారు …

Related posts

అవే అంశాలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తాం!: వినోద్ కుమార్

Ram Narayana

చాలా సంతోషంగా ఉంది: సీఎం రేవంత్ రెడ్డిపై జానారెడ్డి ప్రశంసల వర్షం

Ram Narayana

ఖబర్దార్ తుమ్మల అహంకారం తగ్గించుకోకపోతే ప్రజలు బుద్ది చెప్పడం ఖాయం ..మంత్రి అజయ్..

Ram Narayana

Leave a Comment