Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

దుమారం రేపుతున్న పల్లా కుక్కల వ్యాఖ్యలు

 పల్లా రాజేశ్వర్ రెడ్డి ‘కుక్క’ వ్యాఖ్యలపై జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఫైర్!

  • ఇతర పార్టీల నుండి వచ్చిన ఎమ్మెల్యేలపై పల్లా వివాదాస్పద వ్యాఖ్యలు
  • సీఎంకు, బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించేలా పల్లా వ్యాఖ్యలు ఉన్నాయన్న ముత్తిరెడ్డి
  • పల్లా తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్

బీఆర్ యస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒక సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎందుకు చేర్చుకుంటున్నారు సార్ అంటే…. సీఎం కేసీఆర్ అవతలివైపు ఉంటె వాళ్ళు కుక్కల్లా మొరుగుతున్నారను , ఇటువైపు తెస్తే పిల్లుల్లా పడి ఉంటారని అన్నట్లు చెప్పినమాటలు దుమారం రేపుతున్నాయి… సీఎం కేసీఆర్ అలా అన్నారో లేదోగానీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాటలు వైరాలు అవుతున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే ఎన్నికల వేళ ఎలాంటి మాటలు పార్టీకి చేటు తెచ్చేవిగా మారె ప్రమాదం లేకపోలేదు …పల్లా జనగాం టికెట్ ఆశిస్తున్నందున ప్రస్తుతం అదే అధికార పార్టీ శాసనసభ సభ్యుడు ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి కూడా పల్లా వ్యాఖ్యలను తప్పు పట్టారు .

టీడీపీ, కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్‌లోకి వచ్చిన ప్రజాప్రతినిధులు, నేతలపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తీవ్రంగా స్పందించారు. శనివారం ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రికి, బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగేలా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడారని ధ్వజమెత్తారు. తెలంగాణ స్థిరత్వం కోసం ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని వక్రీకరించారన్నారు. పల్లా తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

కాగా, ఇటీవల పల్లా మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నిన్నటి వరకు ఆ పార్టీలో ఉన్నావారు, ఇప్పుడు మనకు ఎందుకు సర్, ఇప్పటికే మనకు 88 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వారిని తీసుకోవడం ఎందుకని తాను కేసీఆర్ ను ప్రశ్నించానని, అందుకు కేసీఆర్ మాట్లాడుతూ.. వాళ్లు అవతలివైపు ఉండి కుక్కల్లాగా మాట్లాడుతున్నారని, ఆ కుక్కనే ఇటు వేస్తే పిల్లిలా అయిపోద్ది అని తనతో చెప్పారన్నారు. ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్‌లో కలకలం రేపుతున్నాయి

Related posts

పార్టీ మార్పుపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

Ram Narayana

ఖమ్మం ఎంపీ సీటు ఇప్పించండి …సీఎం రేవంత్ ని కలిసి కోరిన విహెచ్

Ram Narayana

80 వేల పుస్తకాలు చదివి ఇంజినీర్‌గా మారి కేసీఆర్ ‘కాళేశ్వరం’ నిర్మించారు.. కిషన్ రెడ్డి ఎద్దేవా

Ram Narayana

Leave a Comment