అంతర్జాతీయం

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం

  • ఫ్లోరిడా రాష్ట్రంలో శనివారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు నల్లజాతీయుల మృతి
  • జాక్సిన్‌విల్ ప్రాంతంలోని ఓ షాపు పార్కింగ్ స్థలంలో దుండగుడి కాల్పులు
  • ఇది జాత్యాహంకార పూరిత దాడి అని పోలీసుల ప్రకటన  

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి జాత్యాహంకారం అమాయకులను కాటేసింది. ఫ్లోరిడా రాష్ట్రంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు నల్లజాతీయులు మృతిచెందారు. మరణించిన వారిలో ఇద్దరు పురుషులు, ఓ మహిళ ఉన్నారు. జాక్సన్‌విల్ ప్రాంతంలో గల డాలర్ జనరల్ స్టోర్ వద్ద శనివారం ఈ దారుణం జరిగింది.  

మధ్యాహ్నం దుండగుడు ఏఆర్-15 స్టైల్ రైఫిల్, హ్యాండ్ గన్‌తో వచ్చి పార్కింగ్ స్థలంలో కనిపించిన నల్లజాతీయులపై కాల్పులు జరపడంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. జాత్యాహంకారంతోనే నిందితుడు ఈ దుర్మార్గానికి తెగబడ్డాడని జాక్సన్‌విల్ పోలీసులు తెలిపారు.

Related posts

పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులు చేయడంపై స్పందించిన భారత్

Ram Narayana

డెన్మార్క్‌ ప్రధానికి ట్రంప్‌ బెదిరింపులు..!

Ram Narayana

భారతీయ నిపుణులకు బెటర్ వర్క్ వీసాలు ఆఫర్ చేస్తున్న ఐదు దేశాలు!

Ram Narayana