Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆరోగ్యం

ఈ మూడు యోగాసనాలతో గుండె జబ్బులకు చెక్ పెట్టొచ్చట!

  • రోజూ వేయడం ద్వారా గుండె పదిలం
  • ఇటీవలి కాలంలో పెరుగుతున్న హృద్రోగాలు
  • మారిన జీవనశైలి వల్లేనంటున్న నిపుణులు

జీవనశైలిలో మార్పుల కారణంగా ఇటీవలి కాలంలో హృద్రోగాల బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా గుండె జబ్బులతో కుప్పకూలుతున్నారు. దీనికి మానసిక, శారీరక ఒత్తిడితో పాటు అస్తవ్యస్తమైన జీవన విధానం, రోజూ తీసుకునే ఆహారం సహా పలు అంశాలు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, యోగాతో గుండె జబ్బులకు చెక్ పెట్టవచ్చని, ముఖ్యంగా మూడు యోగాసనాలు రోజూ వేయడం ద్వారా గుండెను పదిలంగా కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. అవి.. ఉత్థిత త్రికోణాసనం, పశ్చిమోత్తానాసనం, అర్ధ మత్య్సేంద్రాసనం.

ఉత్థిత త్రికోణాసనం ఎలా వేయాలంటే..
నేలపై నిటారుగా నిలబడి కాళ్లను కొద్దిగా ఎడంగా చాపాలి. కుడికాలిని మరింత దూరం జరిపి పాదాన్ని కుడిచేతితో అందుకోవాలి. ఎడమ చేతిని నిట్టనిలువుగా పైకి లేపి ఉంచాలి. వీలైనంత సేపు ఈ భంగిమలో ఉండి ఆపై సాధారణ స్థితికి రావాలి. అనంతరం మళ్లీ ఎడమ కాలితో ఇదేవిధంగా చేయాలి. ఇలా రోజూ నాలుగైదు సార్లు చేస్తే గుండె పదిలంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


పశ్చిమోత్తానాసనం వేసే విధానం..
నేలపై కూర్చుని కాళ్లను ముందుకు చాపాలి.. తర్వాత ముందుకు వంగి పాదాలను పట్టుకోవాలి. తలను పూర్తిగా కిందికి వంచి కాళ్లపై ఆనించాలి. వీలైనంత సేపు ఈ భంగిమలో ఉండి పైకి లేవాలి. ఈ ఆసనం కూడా రోజూ నాలుగైదు సార్లు వేయాలి.


అర్ధ మత్య్సేంద్రాసనం..
నేలపై కూర్చుని కాళ్లను ముందుకు చాపాలి. ఎడమకాలిని తీసి కుడికాలి మీదుగా వేసి.. ఎడమకాలి పాదం కుడికాలి మోకాలికి అవతలివైపు వచ్చేలా వేయాలి. ఇప్పుడు కుడిచేతితో ఎడమ మోకాలిని కుడివైపుకు వంచినట్లు ఉంచాలి. తలను ఎడమ భుజం వైపు తిప్పి చూడాలి. ఎడమ చేతిని నేలపై ఆనించి వీపు నుంచి దూరంగా జరపాలి. ఈ భంగిమలో కొంతసేపు ఉండి సాధారణస్థితికి రావాలి. ఆపై కుడివైపు కూడా ఇలాగే చేయాలి.

Related posts

జీరా వాటర్​, ధనియా వాటర్​… బరువు తగ్గేందుకు ఏది బెస్ట్​?

Ram Narayana

టాలీవుడ్ విలన్ సాయాజీ షిండే కు యాంజియోప్లాస్టీ నిర్వహించిన వైద్యులు…

Ram Narayana

లివర్ ను సహజంగా క్లీన్ చేసే ఆహారం ఇదే!

Ram Narayana

Leave a Comment