- ఎయిర్‌పోర్టులో బాంబు పెట్టామంటూ కంట్రోల్ రూముకు ఈమెయిల్
- బాంబ్, డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు
- ఉత్తదే అని తేల్చిన పోలీసులు
- గుర్తు తెలియని దుండగుడిపై కేసు
శంషాబాద్ విమానాశ్రయంలో బాంబు పెట్టామంటూ ఓ వ్యక్తి ఈమెయిల్ ద్వారా బెదిరించడంతో కలకలం రేగింది. నిన్న ఉదయమే ఈ ఘటన జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. విమానాశ్రయంలో బాంబు పెట్టామని, మరికాసేపట్లో పేలబోతోందంటూ గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్‌కు ఈమెయిల్ చేశాడు.
వెంటనే అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్, స్థానిక పోలీసులు బాంబ్ స్క్వాడ్, డాగ్‌స్క్వాడ్‌తో విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహించారు. చివరికి అది ఉత్తుత్తి బెదిరింపు అని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈమెయిల్ ఆధారంగా గుర్తు తెలియని దుండగుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.